కోల్‌కతా: బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ పెళ్లి చేసుకున్నారు. వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను ఆమె వివాహమాడారు. టర్కీలోని బొడ్రమ్ నగరంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో బుధవారం వీరి పెళ్లి జరిగింది. నిఖిల్‌ను పెళ్లాడినట్టు ట్విటర్ ద్వారా జహాన్ వెల్లడించారు. తమ పెళ్లి ఫొటోను షేర్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన పెళ్లి దుస్తుల్లో వధూవరులు మెరిశారు.
నూతన దంపతులకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బాసిర్‌హాత్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నుస్రత్ జహాన్ 3,50,369 మెజార్టీతో ఘన విజయం సాధించారు. పెళ్లి చేసుకునేందుకు టర్కీ వెళ్లడంతో లోక్‌సభ సభ్యురాలిగా ఆమె ఇంకా ప్రమాణం స్వీకారం చేయలేదు. స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత ఎంపీగా ఆమె ప్రమాణం చేయనున్నారు. (చదవండి: ‘ఇరుకు’ మాటలు)
Comments
Please login to add a commentAdd a comment