Nusrat Jahan on Marriage Controversy Says I Was Wrongly Portrayed - Sakshi
Sakshi News home page

Nusrat Jahan: నిఖిల్‌తో పెళ్లిపై నుస్రత్‌ సంచలన వ్యాఖ్యలు

Published Fri, Nov 12 2021 12:21 PM | Last Updated on Fri, Nov 12 2021 4:04 PM

Nusrat Jahan on Marriage Controversy Says I Was Wrongly Portrayed - Sakshi

Nusrat Jahan on Marriage Controversy: ప్రముఖ నటి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్ జహాన్ తన వైవాహిక స్థితిపై పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఆమె వ్యక్తిగత జీవితంపై పలువురు లేవనెత్తుతున్న ప్రశ్నల గురించి గురువారం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. భారత పార్లమెంటులో తన వివాహ స్థితిపై తన వైఖరిని స్పష్టం చేసినట్లు ఈ సందర్భంగా ఆమె పేర్కొంది. 

వ్యాపారవేత్త నిఖిల్‌​ జైన్‌తో తన వివాహం గురించి నుస్రత్‌ నోరువిప్పారు. 'టర్కీలో జరిగిన నా పెళ్లికి వారు హోటల్‌ బిల్లులు, ఖర్చులు కూడా చెల్లించలేదు. వారికి నేను ఏమీ చెప్పనవసరం లేదు. నేను నిజాయితీపరురాలిని. నన్ను తప్పుగా చిత్రీకరించారు. ఇప్పుడు నేను ఇదే విషయాన్ని స్పష్టం చేయదలచుకున్నాను. ఎవరి పేరూ చెప్పకుండా, ఇతరులను బాధ్యులను చేయడం, తప్పుగా చూపించడం చాలా సులభం అని' నుస్రత్‌ పేర్కొన్నారు. 

చదవండి: (ఆ హీరో నాపై పలుమార్లు అత్యాచారం చేశాడు : నటి)

నుస్రత్ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. నవంబర్‌లో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరవుతానని ఆమె వెల్లడించారు. ఇటీవల తన స్నేహితురాలైన సినీనటి స్రబంతి ఛటర్జీ కుంకుమ శిబిరం నుంచి నిష్క్రమించడం గురించి అడిగినప్పుడు.. తాను ఎప్పుడూ ఎవరికీ రాజకీయ సలహా ఇవ్వనని చెప్పింది. యష్‌కు కూడా తాను ఎలాంటి రాజకీయ సలహా ఇవ్వనని, అది వారి ఇష్టమని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ అన్నారు.

చదవండి: (మెగాస్టార్‌తో స్టెప్పులేయనున్న సల్మాన్‌ఖాన్‌)

కాగా, నుస్రత్‌ జహాన్‌.. నిఖిల్‌ జైన్‌ని 2019 జూన్‌ 19న టర్కీలో పెళ్లి చేసుకున్నారు. అయితే నవంబర్‌ 2020 నుంచి విభేదాల కారణంగా వారిద్దరూ విడిగా ఉంటున్నారు. ఆగస్ట్ 26, 2021న నుస్రత్.. ఇషాన్ అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. జనన ధృవీకరణ పత్రంలో యష్ దాస్‌గుప్తా పేరును ఇషాన్ తండ్రిగా చేర్చింది. అయితే, భారతీయ చట్టాల ప్రకారం నిఖిల్‌ జైన్‌తో వివాహం చెల్లదని, కేవలం లివింగ్‌ రిలేషన్‌షిప్‌గా మాత్రమే పరిగణించబడుతుందని నుస్రత్‌ వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement