
కలకత్తా: అనుమతి లేకుండా తన ఫొటో ఉపయోగించిన వీడియో చాట్ యాప్‌పై నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మంగళవారం కలకత్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ ప్రమోషన్ కోసం తన ఫొటో వాడటంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు యాప్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె పోలీసులను కోరారు. అంతేగాక ప్రకటనకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విటర్‌లో షేర్ చేస్తూ పోలీసు కమిషనర్ అనుప్ శర్మను ట్యాగ్ చేశారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ.. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం సైబర్ సెల్‌తో దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.