కోల్‌కతా : కరోనా కారణంగా విధించిన ఆంక్షలను ఉల్లంఘించినందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రతి ఏటా దసరా ఉత్సవాల సందర్భంగా బెంగాల్‌లో పెద్ద ఎత్తున దేదీప్యమానమైన అలంకరణలతో పాండల్స్ (దేవీ మండపాలు) దర్శనమిస్తాయి. అయితే కోవిడ్ కారణంగా ఈ ఏడాది పాండల్స్ ఏర్పాటుచేయడంపై కలకత్తా హైకోర్టు ఆంక్షలు విధించింది. అయినప్పటికీ ఎంపీ నుస్రత్ జహాన్ పాండల్స్‌లో దుర్గామాత పూజా కార్యక్రమాలకు హజరయ్యారని పిటిషనర్ కోర్టుకు వివరించారు. పాండల్స్‌ను నో ఎంట్రీ జోన్‌లుగా ప్రకటించినప్పటికీ ప్రజా ప్రతినిధులు నుస్రత్ జహాన్, దేవీ మండపాలను దర్శించారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా కోర్టు ఆంక్షలను బేఖాతరు చేయడం కోర్టు దిక్కారానికి పాల్పడినట్లే అని పేర్కొన్నారు. కాగా దసరా సందర్భంగా ఈనెల 24న ఎంపీ నుస్రత్ జహాన్ ఆమె భర్తతో కలిసి కోల్‌కతాలోని ప్రముఖ పాండల్‌ని సందర్శించారు. (నవంబర్ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు )
#Exclusive: Contempt of Court charge leveled against actor #NusratJahan over her visit to a #DurgaPuja pandal despite the High Court ban. Watch this #ReporterDiary by Indrajit Kundu for more. @iindrojit
— IndiaToday (@IndiaToday) October 29, 2020
More videos https://t.co/FAHzdk9TO8 pic.twitter.com/wMXnDAjGaB
Comments
Please login to add a commentAdd a comment