![Twinkle And Akshay Are Married Nusrat and I Are Not: Yash Dasgupta - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/18/pic.jpg.webp?itok=xMdIeeaW)
కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీఎంసీని ఢీ కొట్టేందుకు అన్ని విధాల ప్రయత్నాలు మొదలుపెట్టిన బీజేపీ.. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ (బెంగాల్ చిత్రపరిశ్రమ)కు చెందిన యాశ్ దాస్ గుప్తా, ఇంకా దేవ్ అధికారి, సంధ్యా రాయ్ సహా పలువురు నటులు బీజేపీలో చేరారు. అయితే యశ్ దాస్ బీజేపీలోకి చేరడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఇందుకు ఆయన గతంలో టీఎంసీ ఎంపీ నుస్రత్ జహన్‌తో డేటింగ్ చేసినట్లు వార్తలు రావడమే కారణం. 2019లో నిఖిల్ అనే వ్యాపారవేత్తని పెళ్లాడిన నుస్రత్ కొన్నాళ్ల క్రితం హీరో యశ్‌తో కలిసి రాజస్తాన్ పర్యటనకు వెళ్లొచ్చింది.
దీంతో వీరిద్దరి మధ్యా ప్రేమాయణం నడిచినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున రూమర్లు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఆమె టీఎంసీలో చేరిన అనంతరం ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే యశ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యశ్ దాస్ బీజేపీ చేరికపై అయన్ని ప్రశ్నించగా...తనకు ప్రధాని నరేంద్రమోదీపై ఎంతో నమ్మకం ఉందని, భారత్‌పై ఆయనకున్న విజన్ వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చనట్లు తెలిపాడు. బెంగాల్‌లో ఉద్యోగవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన అవసరం ఉందని, అది బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ఎంపీ సుస్రత్ గురించి ప్రశ్నించగా..ఒకే కుటుంబంలో భిన్నాబిప్రాయాలు ఉండటం సహజమే కదా..అది కూడా రాజకీయాల పరంగానూ ఉండొచ్చు అని పేర్కొన్నారు. అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా లాగానే అని అడగ్గా..వారిద్దరు భార్యాభర్తలు..నేను, నుస్రత్ కాదు అని బదులిచ్చారు.
చదవండి : (జయలలిత బాటలో దీదీ: విజయం వరిస్తుందా?)
Comments
Please login to add a commentAdd a comment