
కలకత్తా: పశ్చిమబెంగాల్‌కు చెడ్డపేరు తెచ్చేందుకు, తమ పార్టీ నేతలను అరెస్టు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత, సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. బుధవారం కలకత్తాలో ప్రధాని పర్యటన నేపథ్యంలో మమత చేసిన వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి.
‘టీఎంసీ నేతలను అరెస్టు చేయాల్సిందిగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు వచ్చినట్లు మాకు తెలిసింది. మాకు న్యాయమైన లోక్‌సభ ఎన్నికలు కావాలి. బీజేపీ ఎన్నికలు వద్దు. బెంగాల్ గురించి మాట్లాడేవాళ్లు ఉత్తరప్రదేశ్ రావాలి. గత రెండు రోజుల్లో అక్కడ ఇద్దరు మైనర్లను కట్టేసి హత్య చేశారు.
యూపీ కంటే బెంగాల్ చాలా బెటర్. బీజేపీ రెచ్చగొట్టే చర్యలను బెంగాల్ మహిళలు తిప్పికొట్టారు. వారంతా మాతోనే ఉన్నారు’అని మమత తెలిపారు. కాగా, ప్రధాని మోదీ బుధవారం కలకత్తాలో దేశంలతోనే తొలి అండర్ వాటర్ మెట్రో లైన్ ఈస్ట్ వెస్ట్ కారిడార్‌ను ప్రారంభిస్తారు.