‘మోదీకి రెండు నిమిషాల పని..’ బీజేపీ ఎంపీ దిలీప్‌ ఘోష్‌ వ్యాఖ్యలు | MP Dilip Ghosh Warns TMC On Sandeshkhali Violence, Says Will Take PM Modi Only 2 Minutes To Cool Bengal - Sakshi
Sakshi News home page

‘మోదీకి రెండు నిమిషాల పని..’ బీజేపీ ఎంపీ దిలీప్‌ ఘోష్‌ వ్యాఖ్యలు

Published Sun, Mar 3 2024 12:14 PM | Last Updated on Sun, Mar 3 2024 5:45 PM

MP Dilip Ghosh Says Will Take PM Modi Only 2 Minutes To cool Bengal - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో  గుండాలు, అత్యాచార నేరస్తులు అధికార పార్టీ టీఎంసీ జెండా కింద రక్షింపబడుతున్నారని బీజేపీ ఎంపీ దిలీప్‌ ఘోష్‌ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు.

‘బెంగాల్‌లో గుండాలు, అత్యాచారానికి పాల్పడే  వ్యక్తులు ఎక్కువ అయ్యారు. వారంతా కూడా  టీఎంసీ జెండా కింద రక్షణ పొందుతున్నారు. టీఎంసీ నేరస్తులను, అత్యాచార నిందితులను రెండు నెలల నుంచి కాపాడుతోంది. బీజేపీ, మీడియా నిరసనల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

... తర్వాతే ఆయన్ను టీఎంసీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. టీఎంసీ పార్టీ బెంగాల్‌ మొత్తాన్ని నాశనం చేస్తోంది. మహిళల నుంచి భూములు లాక్కుంటున్నారు. కశ్మీర్‌ సమస్యను పరిష్కరించిన ప్రధానమంత్రి మోదీకి.. బెంగాల్‌లో పరిస్థితులను శాంతింప చేయటం కేవలం రెండు నిమిషాల పని’ అని ఎంపీ దిలీప్‌ ఘోష్‌ అన్నారు.

శనివారం బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో బెంగాల్‌ నుంచి మొత్తం 42 స్థానాలకు 20 మంది అభ్యర్థులను ప్రకటించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లను గెలుచేకున్న విషయం తెలిసిందే. ఈసారి బెంగాల్ 35 స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ టార్గెట్‌ పెట్టుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement