Dileep Ghosh
-
కొణతం దిలీప్‌ను వెంటనే విడుదల చేయాలి: జగదీష్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇంఛార్జ్ కొణతం దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా దిలీప్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించినట్టు తెలుస్తోంది.కాగా, కొణతం దిలీప్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా పనిచేశారు. అయితే, రాష్ట్రంలో వర్షాల కారణంగా విపత్కర సమయాల్లో వరద బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు దిలీప్‌ను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, దిలీప్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ వద్ద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో నిజాలు చెప్పేవారిని తెలంగాణ ప్రభుత్వం వేధిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాడి, ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా పనిచేసిన కొణతం దిలీప్‌ను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారు. దిలీప్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఐదు గంటలుగా పీఎస్‌లోనే బంధించారు. దిలీప్ మనోవేదనకు గురయ్యారు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పమంటే మేము అరెస్ట్ చేయలేదు. విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. తెలుగు స్క్రైబ్‌లో పెట్టిన వార్తపైన విచారణ చేస్తున్నామంటున్నారు. శాంతి భద్రతలకు ఎక్కడ భంగం జరిగిందో పోలీసులు చెప్పాలి. పై నుంచి వచ్చే ఆర్డర్ల ప్రకారం పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ హామీనీ అమలు చేయడం లేదు. వరదల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. వరదల్లో ఎక్కడ మంత్రులు కనిపించలేదు. కొందరు సినిమాలు చూసుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో నిజాలు చెప్పేవారిని ప్రభుత్వం వేధిస్తుంది. దిలీప్‌ను వెంటనే రిలీజ్ చేయాలి అని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..‘ఎలాంటి కారణం లేకుండా దిలీప్‌ను అక్రమంగా నిర్బంధించారు. తెలుగు స్కైబ్కు దిలీప్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఏవైనా ఆధారాలుంటే చూపించాలి. మత కలహాలను రెచ్చగొట్టే బీజేపీని ఏమీ అనట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి తెలుగు స్రైబ్కి ఎలాంటి సంబంధం లేదు. సీఎం ఆదేశాల మేరకే పోలీసులు దిలీప్‌ను కిడ్నాప్ చేశారు అని కామెంట్స్ చేశారు. -
‘మోదీకి రెండు నిమిషాల పని..’ బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో గుండాలు, అత్యాచార నేరస్తులు అధికార పార్టీ టీఎంసీ జెండా కింద రక్షింపబడుతున్నారని బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. ‘బెంగాల్లో గుండాలు, అత్యాచారానికి పాల్పడే వ్యక్తులు ఎక్కువ అయ్యారు. వారంతా కూడా టీఎంసీ జెండా కింద రక్షణ పొందుతున్నారు. టీఎంసీ నేరస్తులను, అత్యాచార నిందితులను రెండు నెలల నుంచి కాపాడుతోంది. బీజేపీ, మీడియా నిరసనల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ... తర్వాతే ఆయన్ను టీఎంసీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. టీఎంసీ పార్టీ బెంగాల్ మొత్తాన్ని నాశనం చేస్తోంది. మహిళల నుంచి భూములు లాక్కుంటున్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించిన ప్రధానమంత్రి మోదీకి.. బెంగాల్లో పరిస్థితులను శాంతింప చేయటం కేవలం రెండు నిమిషాల పని’ అని ఎంపీ దిలీప్ ఘోష్ అన్నారు. #WATCH | Medinipur, West Bengal: BJP MP Dilip Ghosh says, "Goons and rapists are present in every nook and corner of the state, protected under the flag of TMC. TMC protected a criminal, a rapist for two months... After being pressured by our protests and the media, the state… pic.twitter.com/szqaLyhalp — ANI (@ANI) March 3, 2024 శనివారం బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో బెంగాల్ నుంచి మొత్తం 42 స్థానాలకు 20 మంది అభ్యర్థులను ప్రకటించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లను గెలుచేకున్న విషయం తెలిసిందే. ఈసారి బెంగాల్ 35 స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. -
‘పద్దతి మార్చుకోకపోతే స్మశానానికే..’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ కార్యకర్తలు తమ పద్దతి మార్చుకోకపోతే వారి చేతులు, కాళ్ళు విరిగిపోయే ప్రమాదం ఉందని.. చనిపోయే అవకాశం కూడా ఉందంటూ హెచ్చరించారు. హల్దియాలో నిర్వహించిన ర్యాలీలో ఘోష్ ప్రసంగిస్తూ.. "ఇబ్బందులు సృష్టిస్తున్న దీదీ సోదరులు రాబోయే ఆరు నెలల్లో వారి పద్దతిని మార్చుకోవాలి. లేదంటే వారి చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరిగిపోవచ్చు.. తలలు పగలిపోవచ్చు. మీరు ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. అయినా కూడా మీ పద్దతిని మార్చుకోకపోతే ఏకంగా స్మశానవాటికకు వెళ్ళవలసి ఉంటుంది" అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బెంగాల్లో తృణమూల్ ప్రభుత్వం రోజులు దగ్గర పడ్డాయన్నారు ఘోష్. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర దళాల అధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. బిహార్‌లో లాలూ అధికారంలో ఉన్పప్పుడు జంగిల్ రాజ్యం ఉండేదని.. రాష్ట్రంలో హింస అనేది రోజువారీ వ్యవహారం అన్నారు. కానీ తమ పార్టీ గూండాలను తరిమికొట్టి బీజేపీ రాజ్యాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ‘మేము జంగిల్ రాజ్‌ను ప్రజాస్వామ్యంగా మార్చాము. పశ్చిమ బెంగాల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము’ అన్నారు. "రాబోయే అసెంబ్లీ ఎన్నికలు దీదీ పోలీసుల అధ్వర్యంలో కాకుండా దాదా పోలీసుల నియంత్రణలో జరుగుతాయని తెలియజేస్తున్నాను. ఖాకీ దుస్తులు ధరించిన పోలీసులు మామిడి చెట్టు క్రింద ఉన్న బూత్‌ల నుంచి వంద మీటర్ల దూరంలో, కుర్చీపై కూర్చుని, ఖైని నములుతూ ఓటింగ్‌ని చూస్తారు అంతే" అన్నారు. (చదవండి: ఇంకెన్ని సార్లు అవమానిస్తారు..) కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ పర్యటన ముగిసిన రెండు రోజుల తరువాత దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు వెలువడటం గమనార్హం. ఇక దిలీప్ ఘోష్ వ్యాఖ్యలని టీఎంసీ నాయకులు ఖండించారు. ఘోష్ రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇక రాష్ట్రంలోని 294 సీట్లలో 200 స్థానాలను గెలుచుకోవాలనే బీజేపీ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో టీఎంసీ, బీజేపీల మధ్య గట్టి పోరు జరగుతోంది. రాజకీయ హింస పెరిగింది. తమ మద్దతుదారులపై దాడులు జరిగియాంటూ ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక కార్యచరణ గురించి చర్చించేందుకు బెంగాల్ బీజేపీ నాయకులు సోమవారం పార్టీ చీఫ్ జేపీ నడ్డాను కలిసేందుకు ఢిల్లీకి రానున్నారు. -
కరోనా ఎక్కడుంది..?
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో బీజేపీ ఎన్నికల ప్రచారానికి సంసిద్ధమైంది. మమతా బెనర్జీ సర్కార్‌కు వ్యతిరేకంగా కరోనా వైరస్‌నూ బీజేపీ తన ప్రచార అజెండాలో సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతుంటే ‘కరోనా పోయింది’ అంటూ ఓ బీజేపీ అగ్రనేత పార్టీ ప్రచార ర్యాలీలో పేర్కొన్నారు. బీజేపీ ర్యాలీలను అడ్డుకునేందుకు మమతా బెనర్జీ వైరస్ సాకుతో లాక్డౌన్లు విధిస్తోందని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ గురువారం ఆరోపించారు. బెంగాల్లో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకుండా బీజేపీని నిరోధించేందుకే దీదీ ఈ ఎత్తుగడ వేశారని, ఏ ఒక్కరూ తమను అడ్డుకోలేరని ధనియకలిలో జరిగిన ప్రచార ర్యాలీలో ఘోష్ పేర్కొన్నారు. చదవండి : నిరూపిస్తే.. 101 గుజీలు తీస్తా: దీదీ దేశంలో కరోనా వైరస్ కేసులు 45 లక్షల మార్క్‌ను దాటగా బెంగాల్లోనే దాదాపు 2 లక్షల వైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ను తేలిగ్గా తీసుకోరాదని, మాస్లు ధరించి..భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ గురువారం హెచ్చరించారు. బీజేపీ అగ్రనేతలు సైతం కోవిడ్-19 నేపథ్యంలో ఆన్లైన్ ర్యాలీలకే పరిమితమవుతున్న నేపథ్యంలో దిలీప్ ఘోష్ ర్యాలీలో పాల్గొనడం గమనార్హం. మరోవైపు బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా సైతం మమతా బెనర్జీ లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. అయోథ్యలో ఆగస్ట్ 5న మందిర నిర్మాణానికి భూమిపూజ సందర్భంగా ఆరోజు మమతా బెనర్జీ లాక్డౌన్ విధించారని విమర్శించారు. జులై 31న ఈద్ అల్ అదా సందర్భంగా నియంత్రణలను సడలించారని ఆరోపించారు. ఇది దీదీ హిందూ వ్యతిరేక, మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలకు పరాకాష్టని నడ్డా విమర్శించారు. -
నేనింతే : లాక్డౌన్ నిబంధనలు బేఖాతర్
కోల్‌కతా : బెంగాల్లో తృణమూల్ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను తాను అనుసరించబోనని బెంగాల్ బీజేపీ చీఫ్, ఎంపీ దిలీప్ ఘోష్ స్పష్టం చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనపై ఎలాంటి చర్య అయినా తీసుకోవచ్చని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలో అంఫన్ తుపాన్ బాధిత ప్రజలకు సాయపడేందుకు ముందుకొచ్చే బీజేపీ నేతలు, కార్యకర్తలను తృణమూల్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని ఘోష్ ఆరోపించారు. తుపాన్ బాధితుల సాయానికి పునరవాస కార్యకలాపాల్లో పాల్గొనే బీజేపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ సామాగ్రిని అందించేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బీజేపీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి పోలీసులతో ఘర్షణకు దిగితే జరిగే తీవ్ర పరిణామాలకు దీదీ సర్కార్ బాధ్యత వహించాలని ఘోష్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి, పాలక పార్టీ నేతలు, మంత్రులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నా ఏ ఒక్కరూ వారిని ఆపడం లేదని ఆరోపించారు. చదవండి : లాక్డౌన్: మమత సర్కారు కీలక నిర్ణయం -
మరి షహీన్‌బాగ్ ఘటనలో ఎవరూ మరణించలేదే!
కోల్‌కతా : నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల ఎదుట పొడవాటి క్యూల్లో వేచిచూడటంతో వంద మంది ప్రాణాలు కోల్పోయారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ మరో వివాదానికి తెరతీశారు. నోట్ల రద్దు సమయంలో అంతమంది చనిపోతే సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో జరుగుతున్న ఆందోళనల్లో ఏ ఒక్కరూ ఎందుకు మరణించలేదని ఆయన ప్రశ్నించారు. కోల్‌కతా ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఘోష్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు గంటల పాటు క్యూల్లో నిలుచుని ప్రజలు ప్రాణాలు విడిస్తే..ఇప్పుడు మహిళలు, చిన్నారులు రోజంతా మంచును సైతం లెక్కచేయకుండా గంటల తరబడి కూర్చున్నా ఏ ఒక్కరూ చనిపోకపోవడం తనను ఆశ్చర్యపరుస్తోందని అన్నారు. నిరసనల్లో పాల్గొనడం ద్వారా వారికి ఏం ఒరుగుతోందని ప్రశ్నించారు. షహీన్‌బాగ్‌లో మహిళలు, చిన్నారులు రోజంతా ఆందోళనలో పాల్గొనడంతో వీరి నిరసన అందరినీ ఆకట్టుకుంటోందని, వీరికి రోజుకు రూ 500 చెల్లిస్తున్నారని కొందరు చెబుతున్నారని చెప్పారు. షహీన్‌బాగ్ ఉదంతం వెనుక ఏం జరుగుతోందనేది త్వరలోనే వెలుగులోకి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి : ‘అలాగైతే ఆవులపై గోల్డ్ లోన్’ -
ఘోష్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఫైర్
కోల్‌కతా: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన వారిని కుక్కల్లా కాల్చేశారని ఆ పార్టీ పశ్చిమ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో తప్పుపట్టారు. యూపీ, అసోంలలో బీజేపీ ప్రభుత్వాలు ఏ కారణంగానైనా ప్రజలపై కాల్పులు జరపలేదని అన్నారు. దిలీప్ ఘోష్ వ్యాఖ్యలతో బీజేపీకీ సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని కేంద్ర మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. నదియా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో దిలీప్ ఘోష్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఏఏను వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనల్లో రైల్వే ఆస్తులను, బస్సులను ధ్వంసం చేసిన వారిపై కాల్పులు జరపలేదని మమతా బెనర్జీ సర్కార్‌నూ ఘోష్ దుయ్యబట్టారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై దీదీ (మమతా బెనర్జీ) పోలీసులు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు... యూపీ, అసోం, కర్ణాటకల్లో తమ ప్రభుత్వాలు ఇలాంటి వారిని కుక్కల్లా కాల్చేశాయని దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చదవండి : లాఠీలతో చితక్కొడతాం.. జైళ్లో పడేస్తాం -
‘అలాగైతే ఆవులపై గోల్డ్ లోన్’
కోల్‌కతా : మన ఆవు పాలలో బంగారం ఉందని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి .బెంగాల్‌కు చెందిన దంకుని ప్రాంతంలోని ఓ వ్యక్తి తన రెండు ఆవులను తాకట్టుపెట్టుకుని బంగారంపై రుణం ఇవ్వాలని మణప్పురం ఫైనాన్స్‌కు చెందిన ఓ బ్రాంచ్‌ను సందర్శించారు. తాను గోల్డ్ లోన్ కోసం తన ఆవులను తీసుకుని ఇక్కడకు వచ్చానని, ఆవు పాలల్లో బంగారం ఉందని తాను విన్నానని, ఈ ఆవులపైనే తాము ఆధారపడ్డామని, వీటిపై తనకు రుణం లభిస్తే తన వ్యాపారాన్ని విస్తరిస్తానని ఆ వ్యక్తి చెప్పకొచ్చారు. మరోవైపు ఘోష్ వ్యాఖ్యలను గరల్‌గచా గ్రామ సర్పంచ్ మనోజ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఘోష్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజలు రోజూ తన వద్దకు వారి ఆవులతో వచ్చి తమ ఆవులపై ఎంత రుణం ఇస్తారని అడుగుతున్నారని చెప్పారు. ఆవు పాలల్లో బంగారం ఉందని చెప్పిన దిలీప్ ఘోష్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు. బుర్ధ్వాన్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో దిలీప్ ఘోష్ మాట్లాడుతూ ఘోష్ తన సిద్ధాంతం వెనుక గల కారణాన్ని విశ్లేషించారు. "భారతీయ ఆవులకు మూపురాలు ఉన్నాయి, అవి విదేశీ ఆవులకు లేవు. మూపురం ధమని ఉంది..దీన్ని బంగారు ధమని అని పిలుస్తారు. సూర్యరశ్మి దానిపై పడినప్పుడు బంగారం తయారవుతుంద’ని చెప్పుకొచ్చారు. -
బెంగాల్ బీజేపీ నేతపై దుండగుల దాడి
కోల్‌కతా : బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్‌పై కోల్‌కతాలో శుక్రవారం ఉదయం దుండగులు దాడికి పాల్పడ్డారు. ఘోష్ మార్నింగ్ వాక్‌తో పాటు లేక్ టౌన్లో ఛాయ్ పే చర్చలో పాల్గొనేందుకు వెళుతుండగా అనూహ్యంగా ఆయనను చుట్టుముట్టిన దుండగులు దాడికి తెగబడ్డారు. దుండగుల దాడిలో తనతో పాటు ఉన్న ఇద్దరు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని ఘోష్ పేర్కొన్నారు. ఈ ఘటన జరిగన సమయంలో తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు అక్కడ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఘోష్‌పై గత ఏడాది సెప్టెంబర్‌లోనూ తూర్పు మిడ్నపూర్‌లో తృణమూల్ కార్యకర్తలు దాడికి పాల్పడటంతో ఆయనకు గాయాలయ్యాయి. దాడి ఘటనలో మరో అయిదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. -
పశ్చిమ బంగ్లాదేశ్‌గా మారబోతుంది!
కలకత్తా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోకి చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ దిలీప్ ఘోష్ ఆరోపించారు. ఈ చొరబాట్ల కారణంగా పశ్చిమ బెంగాల్‌ను కాస్తా ‘పశ్చిమ బంగ్లాదేశ్’గా మార్చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మమతా బెనర్జీ ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో బెంగాల్, బంగ్లాదేశ్‌ను కలిపి పశ్చిమ బంగ్లాదేశ్‌గా ఏర్పాటు చేయాలనుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. భారతదేశం నుంచి బెంగాల్‌ను దూరం చేయాలని ఆమె కుట్రకు పాల్పడుతోందన్నారు. సోమవారం భట్పారా అల్లర్లలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించిన ఆయన.. టీఎంసీ బెంగాల్‌ను మరో పాకిస్తాన్‌గా మార్చాలనుకుంటుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భట్పారా అల్లర్ల సమస్యకు పరిష్కారం చూపడం లేదన్నారు. ఇక్కడి బాధితులకు న్యాయం జరిగే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించడానికి బీజేపి ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి గూండాలను తీసుకువస్తోందని కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై ఘోష్ స్పందిస్తూ.. బెంగాల్‌ను పాకిస్తాన్‌గా మర్చే ఉద్దేశంతో ‘జై శ్రీరామ్ నినాదాలను’ రాష్ట్రంలో అనుమతించడం లేదన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం 42 పార్లమెంట్ స్థానాల్లో.. 18 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ 22 స్థానాలను గెలుచుకొని కొంత బలాన్ని కోల్పోయిన సంగతి విదితమే. -
బీజేపీలో చేరిన ప్రముఖ బంగ్లాదేశ్ నటి
కోల్‌కతా : ప్రముఖ బంగ్లాదేశ్ నటి అంజు ఘోష్ బీజేపీలో చేరారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో బుధవారం ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియా సంధించిన ప్రశ్నలకు మాత్రం ఆమె సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ప్రస్తుతం బంగ్లాదేశీయురాలుగా కొనసాగుతున్నారా.. లేక భారత పౌరసత్వం తీసుకున్నారా అనే దానికి అంజూ స్పష్టత ఇవ్వలేదు. అంజూ 1989లో వచ్చిన హిట్ మూవీ బెడెర్ మెయ్ జోస్నాలో నటించారు. ఈ చిత్రం బంగ్లాదేశ్ సినీ చరిత్రలో అధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ఆమె బెంగాలీ చిత్ర పరిశ్రమలో కూడా పనిచేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీకి ప్రచారం నిర్వహించిన బంగ్లాదేశ్ నటుడు ఫిర్దౌస్ అహ్మద్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఫిర్యాదు చేయడంతో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అతని బిజినెస్ వీసాను రద్దు చేసింది. అంతేకాకుండా తక్షణమే భారత్‌ను వదిలి వెళ్లాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు అదే బీజేపీ బంగ్లాదేశ్ నటిని తమ పార్టీలో చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు బీజేపీపై ట్విటర్ వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆమెను బీజేపీ ఎలా తమ పార్టీలో చేర్చుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం అంజూ ఘోష్ తన పౌరసత్వాన్ని వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘ప్రతీ బుల్లెట్‌ను లెక్కిస్తున్నాం’
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. జుల్పాయిగురి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దిలీప్ ఘోష్.. ‘మా పార్టీకి మద్దతుగా నిలుస్తున్న వారిపై జరుగుతున్న దాడులను చూస్తున్నాం. బీజేపీ కార్యకర్తలపై పేలుతున్న ప్రతీ బుల్లెట్‌ను లెక్కిస్తున్నాం. వాటితోనే తిరిగి సమాధానం చెప్తాం. ఇక్కడ బుల్లెట్లకు కరువు లేదు. మేము తలచుకుంటే ప్రతిచోటును ప్రత్యర్థుల శవాలతో నింపేయగలమంటూ’ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామన్న దిలీప్ ఘోష్.. ఇకపై హింసాకాండను సహించేది లేదంటూ బెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా, గతంలో కూడా బెంగాల్ పోలీసులు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక అటువంటి వారందరినీ విధుల నుంచి తొలగిస్తామంటూ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతిపక్షమనేదే లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఎంతటి దుర్మార్గానికైనా వెనుకాడబోదంటూ ఆయన వ్యాఖ్యానించారు. -
బీజేపీ నేత దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు
కోల్ కతా: రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ లీడర్లను వాళ్ల ఇళ్లలోనే చావగొట్టి వట్టి చేతులతోనే తల నరుకుతానని తీవ్ర వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ కేడర్ పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిపై ఏర్పాటుచేసిన మీటింగ్ లో మాట్లాడిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కు ఆయన నియోజకవర్గం ఖరగ్ పూర్ సర్దార్ లో ఓట్లు వేసిన వారిపై థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తానని అన్నారు. ఖరగ్ పూర్ లో తనకు 8 వేల మంది కార్యకర్తలున్నారనీ నియోజవర్గం నుంచి మొత్తం 34 వేల ఓట్లు తృణమూల్ కు పోలయ్యాయని తెలిపారు. ఈ క్షణం మేం వారందరనీ ఉతికి ఆరేస్తే అడగడానికి వాళ్ల తల్లిదండ్రులు కూడా రారని అన్నారు. దిలీప్ సంఘ్ పరివార్ పేరును వాడుతూ ఇచ్చిన స్పీచ్ వీడియో ఇప్పుడు ఇంటర్నట్ లో హల్ చల్ చేస్తోంది. తమపై దాడులు జరిగితే సహించబోమని ప్రత్యర్ధులకు తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. మాలో సగం మందిని ఆర్ఎస్ఎస్ తయారుచేసిందనీ మేం దేనికైనా తెగిస్తామని అన్నారు. మేం గెలిచింది మూడు సీట్లు మాత్రమే కానీ ఆ బలం చాలు మాకు తృణమూల్ కు తగిన బుద్ధి చెప్పడానికి అని విరుచుకుపడ్డారు. రాష్ట్రం నుంచి బయటకు వెళ్తే తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్ర పరిణామాలను చూస్తారని హెచ్చరించారు.