కరోనా ఎక్కడుంది..? | BJPs Bengal Chief Declares Corona Is Gone | Sakshi
Sakshi News home page

వైరస్‌ లేదన్న బెంగాల్‌ బీజేపీ చీఫ్‌

Published Fri, Sep 11 2020 3:26 PM | Last Updated on Fri, Sep 11 2020 7:47 PM

BJPs Bengal Chief Declares Corona Is Gone - Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో బీజేపీ ఎన్నికల ప్రచారానికి సంసిద్ధమైంది. మమతా బెనర్జీ సర్కార్‌కు వ్యతిరేకంగా కరోనా వైరస్‌నూ బీజేపీ తన ప్రచార అజెండాలో సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు పెరుగుతుంటే ‘కరోనా పోయింది’ అంటూ ఓ బీజేపీ అగ్రనేత పార్టీ ప్రచార ర్యాలీలో పేర్కొన్నారు. బీజేపీ ర్యాలీలను అడ్డుకునేందుకు మమతా బెనర్జీ వైరస్‌ సాకుతో లాక్‌డౌన్‌లు విధిస్తోందని పశ్చిమ బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ గురువారం ఆరోపించారు. బెంగాల్‌లో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకుండా బీజేపీని నిరోధించేందుకే దీదీ ఈ ఎత్తుగడ వేశారని, ఏ ఒక్కరూ తమను అడ్డుకోలేరని ధనియకలిలో జరిగిన ప్రచార ర్యాలీలో ఘోష్‌ పేర్కొన్నారు. చదవండి : నిరూపిస్తే.. 101 గుజీలు తీస్తా: దీదీ

దేశంలో కరోనా వైరస్‌ కేసులు 45 లక్షల మార్క్‌ను దాటగా బెంగాల్‌లోనే దాదాపు 2 లక్షల వైరస్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ను తేలిగ్గా తీసుకోరాదని, మాస్‌లు ధరించి..భౌతిక దూరం పాటించడం​ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ గురువారం హెచ్చరించారు. బీజేపీ అగ్రనేతలు సైతం కోవిడ్‌-19 నేపథ్యంలో ఆన్‌లైన్‌ ర్యాలీలకే పరిమితమవుతున్న నేపథ్యంలో దిలీప్‌ ఘోష్‌ ర్యాలీలో పాల్గొనడం గమనార్హం. మరోవైపు బీజేపీ జాతీయ చీఫ్‌ జేపీ నడ్డా సైతం మమతా బెనర్జీ లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. అయోథ్యలో ఆగస్ట్‌ 5న మందిర నిర్మాణానికి భూమిపూజ సందర్భంగా ఆరోజు మమతా బెనర్జీ లాక్‌డౌన్‌ విధించారని విమర్శించారు. జులై 31న ఈద్‌ అల్‌ అదా సందర్భంగా నియంత్రణలను సడలించారని ఆరోపించారు. ఇది దీదీ హిందూ వ్యతిరేక, మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలకు పరాకాష్టని నడ్డా విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement