
బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌పై కోల్‌కతాలో శుక్రవారం ఉదయం దుండగులు దాడిచేశారు.
కోల్‌కతా : బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్‌పై కోల్‌కతాలో శుక్రవారం ఉదయం దుండగులు దాడికి పాల్పడ్డారు. ఘోష్ మార్నింగ్ వాక్‌తో పాటు లేక్ టౌన్‌లో ఛాయ్ పే చర్చలో పాల్గొనేందుకు వెళుతుండగా అనూహ్యంగా ఆయనను చుట్టుముట్టిన దుండగులు దాడికి తెగబడ్డారు. దుండగుల దాడిలో తనతో పాటు ఉన్న ఇద్దరు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని ఘోష్ పేర్కొన్నారు. ఈ ఘటన జరిగన సమయంలో తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు అక్కడ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఘోష్‌పై గత ఏడాది సెప్టెంబర్‌లోనూ తూర్పు మిడ్నపూర్‌లో తృణమూల్ కార్యకర్తలు దాడికి పాల్పడటంతో ఆయనకు గాయాలయ్యాయి. దాడి ఘటనలో మరో అయిదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి.