సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇంఛార్జ్ కొణతం దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా దిలీప్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించినట్టు తెలుస్తోంది.
కాగా, కొణతం దిలీప్ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా పనిచేశారు. అయితే, రాష్ట్రంలో వర్షాల కారణంగా విపత్కర సమయాల్లో వరద బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు దిలీప్‌ను అరెస్ట్ చేశారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, దిలీప్ అరెస్ట్‌పై బీఆర్‌ఎస్ నేతలు స్పందిస్తున్నారు.
బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ వద్ద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో నిజాలు చెప్పేవారిని తెలంగాణ ప్రభుత్వం వేధిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాడి, ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా పనిచేసిన కొణతం దిలీప్‌ను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారు. దిలీప్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఐదు గంటలుగా పీఎస్‌లోనే బంధించారు. దిలీప్ మనోవేదనకు గురయ్యారు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పమంటే మేము అరెస్ట్ చేయలేదు. విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. తెలుగు స్క్రైబ్‌లో పెట్టిన వార్తపైన విచారణ చేస్తున్నామంటున్నారు.
శాంతి భద్రతలకు ఎక్కడ భంగం జరిగిందో పోలీసులు చెప్పాలి. పై నుంచి వచ్చే ఆర్డర్ల ప్రకారం పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ హామీనీ అమలు చేయడం లేదు. వరదల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. వరదల్లో ఎక్కడ మంత్రులు కనిపించలేదు. కొందరు సినిమాలు చూసుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో నిజాలు చెప్పేవారిని ప్రభుత్వం వేధిస్తుంది. దిలీప్‌ను వెంటనే రిలీజ్ చేయాలి అని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..‘ఎలాంటి కారణం లేకుండా దిలీప్‌ను అక్రమంగా నిర్బంధించారు. తెలుగు స్కైబ్‌కు దిలీప్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఏవైనా ఆధారాలుంటే చూపించాలి. మత కలహాలను రెచ్చగొట్టే బీజేపీని ఏమీ అనట్లేదు. బీఆర్‌ఎస్ పార్టీకి తెలుగు స్రైబ్‌కి ఎలాంటి సంబంధం లేదు. సీఎం ఆదేశాల మేరకే పోలీసులు దిలీప్‌ను కిడ్నాప్ చేశారు అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment