
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యాటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్‌టీ బకాయిలు సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, రాష్ట్ర మాజీ మంత్రి పార్థ చటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే మోదీతో భేటీ అవటంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు నాలుగు రోజుల ఢిల్లీ పర్యాటనకు వెళ్లారు మమతా బెనర్జీ. శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మూతో సైతం సమావేశం కానున్నారు. మమతా బెనర‍్జీ ఢిల్లీ టూర్‌లో ప్రధాని, రాష్ట్రపతితో భేటీ.. బెంగాల్ బీజేపీ, టీఎంసీల మధ్య కీలక అంశంగా మారింది. మమతా బెనర్జీ, ఆమె కుటుంబంపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది టీఎంసీ. ఆగస్టు 7న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవనున్నారు మమతా బెనర్జీ. నీతి ఆయోగ్ కౌన్సిల్ మీటింగ్‌కు ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయం, ఆరోగ్యం, ఆర్థిక అంశాలపై చర్చించనున్నారని సమాచారం.
ఇదీ చదవండి: హస్తినలో తీవ్ర ఉద్రిక్తతలు.. పోలీసుల అదుపులో ప్రియాంక, రాహుల్
Comments
Please login to add a commentAdd a comment