నేడు ఢిల్లీకి చంద్రబాబు.. రేపు మోదీతో భేటీ | AP CM Chandrababu Naidu Delhi Tour On Wednesday, Check Complete Schedule Details | Sakshi
Sakshi News home page

CM Chandrababu Delhi Tour: నేడు ఢిల్లీకి చంద్రబాబు.. రేపు మోదీతో భేటీ

Published Wed, Jul 3 2024 8:42 AM | Last Updated on Wed, Jul 3 2024 10:15 AM

AP CM Chandrababu Delhi Tour On Wednesday

సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్‌ నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం గురించి చర్చించే అవకాశం ఉంది.

కాగా, ఈరోజు(బుధవారం) సాయంత్రం 5:10 గంటలకు విజయవాడ నుంచి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు(గురువారం) ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. మోదీతో సమావేశం అనంతరం హోంమంత్రి అమిత్‌ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డాలను కలిసే అవకాశం ఉంది.

ఇక, చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం.. పారిశ్రామిక రాయితీలు, మౌలిక వస్తువుల కల్పన ప్రాజెక్ట్ వంటి అంశాల అమలుపై సహాయం అందించాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది. మరోవైపు.. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బాబు నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. చంద్రబాబుతో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement