
హస్తినలో బాబు, కేంద్రమంత్రులతో భేటీ
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అవసరాలపై ఆయన మంత్రితో చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ పాల్గొన్నారు.
రెండు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన చంద్రబాబు...ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీపై స్పష్టత తెచ్చుకోవటంతో పాటు రాష్ట్ర విబజన బిల్లులోని ఆంధ్రప్రదేశ్కు రావల్సిన వాటిని సాధించుకునేందుకు ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. రుణమాఫీ, పోలవరం ప్రాజెక్ట్, కృష్ణాజలాలు తదితర అంశాలపై చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది.