West Bengal Chief minister mamata banerjee
-
నిరసనలు కేంద్రం కుట్ర: మమత
కోల్‌కతా: వైద్యురాలి హత్యాచారంపై నిరసనల వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉందని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. వామపక్షాలూ ఈ కుట్రలో భాగమయ్యాయన్నారు. సచివాలయం నబన్నాలో సోమవారం ఒక అధికారిక సమీక్షలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్ రేప్, హత్య ఉదంతంలో నెలరోజులుగా బెంగాల్లో ప్రజలు నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. బాధితురాలి తల్లిదండ్రులకు తానెప్పుడూ డబ్బు ఇవ్వజూపలేదని మమత అన్నారు. ఈమేరకు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. దుర్గాపూజ సమీపిస్తున్నందున నిరసనలు వీడి.. పండుగ ఏర్పాట్లు చేపట్టాలని ప్రజలను కోరారు. ‘వైద్యురాలి కుటుంబానికి నేనెప్పుడూ డబ్బు ఇవ్వజూపలేదు. అభాండాలు వేస్తున్నారు. కూతురి జ్ఞాపకార్థం ఏదైనా కార్యక్రమం చేపట్టదలిస్తే మా ప్రభుత్వం అండగా ఉంటుందని తల్లిదండ్రులకు చెప్పాను. ఎప్పుడేం మాట్లాడాలో నాకు తెలుసు. నిరసనలు ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ కుట్రే. కొన్ని వామపక్ష పార్టీలకు ఇందులో భాగస్వామ్యముంది. పొరుగుదేశంలో అస్థిరత చూసి.. ఇక్కడా అలాంటి ఆందోళనలు రేకెత్తించాలని కొందరు చూస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్‌లు రెండు వేర్వేరు దేశాలని వారు మర్చిపోయారు’ అని మమత ధ్వజమెత్తారు. ఆందోళన నేపథ్యంలో కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని, దుర్గాపూజ వేళ శాంతి భద్రతలపై పట్టున్న అధికారి అవసరం ఉందని దాన్ని తిరస్కరించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. -
అస్తిత్వాన్ని తాకట్టు పెట్టారు
కోల్‌కతా: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని, త్వరలోనే కూలిపోతుందని పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బెదిరించి, భయపెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. మమత ఏ పార్టీ పేరు తీసుకోకపోయినప్పటికీ ఆమె పరోక్షంగా ఎన్డీఏ కీలకపక్షాలను ఉద్దేశించే పలు ఘాటు విమర్శలు చేశారు. అమరువీరుల దినోత్సవ భారీ ర్యాలీలో మమత ఆదివారం మాట్లాడారు. ‘పిరికిపందలు, అత్యాశాపరులైన నాయకులు ఆర్థిక తాయిలాలకు లొంగిపోయారు. మంత్రిపదవులకు బదులుగా డబ్బు ఇస్తామనడం ఎప్పుడైనా విన్నామా? పార్టీలు డబ్బుకు అమ్ముడు పోవడం చూశామా? వాళ్లు (ఎన్డీఏ మిత్రపక్షాలు) పిరికిపందలు, సిగ్గులేని వారు. అత్యాశాపరులు. అస్తిత్వాన్ని తాకట్టు పెట్టారు’ అని మమత ధ్వజమెత్తారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఎక్కువకాలం కొనసాగదని, మతతత్వశక్తులకు విజయం లభించినా.. ఓటమి తప్పదని అఖిలేశ్ అన్నారు. -
Lok Sabha Election 2024: అభిజిత్ గంగోపాధ్యాయ్‌కు ఈసీ నోటీసులు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హైకోర్టు మాజీ జడ్జి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ్‌కు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీచేసింది. ‘మమతా బెనర్జీ మీరు ఎంతకు అమ్ముడుపోయారు? మీ రేటు 10 లక్షలు, ఎందుకంటే మీరు కేయా సేథ్తో మేకప్ చేయించుకుంటున్నారు. మమత అసలు మహిళేనా? అని నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతుంటా’ అని అభిజిత్ ఇటీవల ప్రచారసభలో వ్యాఖ్యానించారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రియాన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. న్యాయవ్యవస్థలో ఉన్నత పదవిని నిర్వహించిన వ్యక్తి మహిళల గౌరవానికి భంగం కలించేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. దీనిపై స్పందించిన ఈసీ ఈనెల 20వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా వివరణ ఇవ్వాలని అభిజిత్ గంగోపాధ్యాయ్‌కు నోటీసులు జారీచేసింది. -
ప్రధాని మోదీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యాటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, రాష్ట్ర మాజీ మంత్రి పార్థ చటర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే మోదీతో భేటీ అవటంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు నాలుగు రోజుల ఢిల్లీ పర్యాటనకు వెళ్లారు మమతా బెనర్జీ. శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మూతో సైతం సమావేశం కానున్నారు. మమతా బెనర్జీ ఢిల్లీ టూర్లో ప్రధాని, రాష్ట్రపతితో భేటీ.. బెంగాల్ బీజేపీ, టీఎంసీల మధ్య కీలక అంశంగా మారింది. మమతా బెనర్జీ, ఆమె కుటుంబంపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది టీఎంసీ. ఆగస్టు 7న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవనున్నారు మమతా బెనర్జీ. నీతి ఆయోగ్ కౌన్సిల్ మీటింగ్‌కు ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయం, ఆరోగ్యం, ఆర్థిక అంశాలపై చర్చించనున్నారని సమాచారం. ఇదీ చదవండి: హస్తినలో తీవ్ర ఉద్రిక్తతలు.. పోలీసుల అదుపులో ప్రియాంక, రాహుల్ -
రాష్రపతి ఎన్నికలపై విపక్షాల సమావేశం
-
మనమంతా ఏకమవుదాం..విపక్ష నేతలకు మమతా బెనర్జీ పిలుపు..!!
-
మమతా బెనర్జీ భవితవ్యం తేలేది నేడే
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవితవ్యం నేడు తేలిపోనుంది. ఆమె పోటీ చేసిన భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. ఈ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో 57 శాతం పోలింగ్ నమోదయ్యిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. భవానీపూర్ నియోజకవర్గం అధికార తృణమూల్ కాంగ్రెస్ పారీ్టకి(టీఎంసీ) కంచుకోటగా ఉంది. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి, నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేశారు. -
పెట్రోధరలపై మమత నిరసన
కోల్‌కతా: మండిపోతోన్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై సెక్రటేరియట్‌కు వెళ్ళి తన నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి ఫిరాద్ హకీం ఎలక్ట్రిక్ స్కూటర్ని నడుపుతుండగా మమతా బెనర్జీ పెట్రోల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు రాసివున్న ప్లకార్డుని మెడలో తగిలించుకొని స్కూటర్ వెనుక సీట్లో కూర్చున్నారు. హజ్రామోర్ నుంచి సెక్రటేరియట్‌కి 7 కిలోమీటర్ల దూరం ఆమె ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఈ వినూత్న నిరసన ప్రదర్శన చేశారు. నాబన్నకి చేరుకున్న అనంతరం దీదీ మాట్లాడుతూ ఇంధన ధరలకు వ్యతిరేకంగా శుక్రవారం నుంచి ఆందోళన చేయనున్నట్టు ప్రకటించారు. అధికారంలోకి రాకముందు బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఎల్పీజీ కనెక్షన్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడేమో వాటి ధరలను పెంచేస్తోందని మమత ఆరోపించారు. మోదీ, అమిత్‌షా దేశాన్ని అమ్మేస్తున్నారన్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియం పేరు మార్చి, మోదీ పేరు పెట్టడాన్ని తప్పు పట్టారు. వారి తీరు చూస్తే ఈ దేశం పేరుని కూడా మారుస్తారో ఏమో అని వ్యాఖ్యానించారు. -
మమత బెంగాల్‌నే కుప్పకూలుస్తారు
అసన్సోల్ , బిర్పారా, మదారిహట్: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై గురువారం ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవినీతితో మమతా లాలూచీ పడ్డారంటూ అసన్సోల్, బిర్పారా, మదారిహట్ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆరోపించారు. మదారిహట్ సభలో ప్రసంగిస్తూ... తృణమూల్ కాంగ్రెస్ నుంచి బెంగాల్‌ను కాపాడమని ప్రజలకు దేవుడిచ్చిన సందేశమే కోల్‌కతా ఫ్లైఓవర్ దుర్ఘటనని అన్నారు. ఈ రోజు బ్రిడ్జి కూలిందని, రేపు మమతా మొత్తం బెంగాల్‌నే కుప్పకూలుస్తారంటూ మోదీ విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ అంటే బీభత్సం, మృత్యువు, అవినీతని వ్యాఖ్యానించారు. తృణమూల్ నేతల అవినీతిని నారదా స్టింగ్ ఆపరేషన్‌లో చూపించినా... ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అవినీతితో మమతా కుమ్మక్కయ్యారని తప్పుపట్టారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రం నిర్వహించే సమావేశాలకు పిలిచినా... మమత హాజరయ్యేవారు కాదని, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలిసినా దీదీ ఇష్టానుసారం ప్రవర్తించేవారని చెప్పారు. మోదీ అధ్యక్షత వహిస్తారనే సమావేశాలకు వచ్చేవారు కాద ని, ఢిల్లీ వచ్చినప్పుడు మాత్రం సోనియాగాంధీని కలిసేవారంటూ విమర్శించారు. ‘ఫ్లై ఓవర్ కూలిన సమయంలో సీఎం ఏం చేయాలి. ప్రజల్ని రక్షించేందుకు, సహాయక చర్యల్లో పాల్గొనాలి. మరి దీదీ ఏం చేశారు. ఫ్లైఓవర్ ప్రమాదం లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ తప్పిదమని చెప్పారు’ అని మోదీ తప్పుపట్టారు. లెఫ్ట్ లేదా రైట్ అన్నది వదిలేసి చనిపోతున్న ప్రజల గురించి ఆలోచించండి దీదీ అంటూ మమతకు చురకలంటించారు. కొందరు ఈ ప్రమాదాన్ని దైవ ఘటన అంటున్నారని, కాని ఇది అవినీతి తప్పిదమన్నారు. కేరళలో కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పోరాడుతూ.. బెంగాల్లో పొత్తు పెట్టుకోవడాన్ని తప్పుపట్టారు. సామాన్యుల సమస్యల్ని గుర్తించండి న్యూఢిల్లీ: ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా సాంకేతిక పరిజ్ఞానం ఉండాలని శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన సీఎస్ఐఆర్ సదస్సులో మోదీ మాట్లాడారు. ఈమేరకు పీఎంఓ ప్రకటన విడుదల చేసింది. సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న వంద సమస్యల్ని గుర్తించి నిర్ణీత గడువులోగా వాటికి పరిష్కారాలను శాస్త్రవేత్తలు కనుగొనాలన్నారు. వ్యవసాయరంగంలో సౌరశక్తి వినియోగానికి అవసరమైన ఆవిష్కరణలు, సైనికులకు ప్రాణరక్షక సామగ్రి వాటి అభివృద్ధి, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధికి (రక్తహీనత) మందులు కనుగొనడం వంటివి జరగాలని ఆకాంక్షించారు. -
ఢిల్లీపై యుద్ధం చేస్తాం: మమత
⇒ శారద కుంభకోణంలో తృణమూల్ పేరును లాగడంపై మమత ఫైర్ ⇒ కుంభకోణంలో అతిపెద్ద లబ్ధిదారు మమతా బెనర్జీయే: కునాల్ ఘోష్ ⇒ నిందతులకు సాయపడేలా మమత వ్యాఖ్యలున్నాయన్న బీజేపీ కోల్‌కతా/న్యూఢిల్లీ: శారద కుంభకోణంలో తమ పార్టీ పేరును లాగడాన్ని రాజకీయంగా, ప్రజాస్వామ్యంగా ప్రతిఘటిస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా తమ పోరును ఢిల్లీ వరకు తీసుకెళ్తామని తీవ్రంగా హెచ్చరించారు. ‘మా సహనం నశిస్తోంది. మా గురించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. కానీ బెంగాల్ మట్టి చాలా బలమైనది. ఇక్కడ విత్తు నాటితే.. ఢిల్లీలో వృక్షమవుతుంది. వీధుల్లోకెక్కేలా మాపై ఒత్తిడి తెస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శారద కుంభకోణంలోకి తమ పార్టీని లాగడాన్ని నిరసిస్తూ అవసరమైతే ఢిల్లీలోనూ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. శారద కుంభకోణంతో సంబంధాలున్నాయంటూ వేధింపులకు గురిచేస్తున్న సీబీఐకి వ్యతిరేకంగా సోమవారం కోల్‌కతాలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆమె ప్రసంగించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ క్షక్ష సాధింపునకు సాధనంగా సీబీఐని వాడుకుంటున్నారని మమత ఆరోపించారు. బ్లాక్‌మనీ అంశంలో కేంద్ర ప్రభుత్వ ముసుగును త్వరలోనే తొలగిస్తామన్నారు. మరో వైపు, సస్పెన్షన్‌లో ఉన్న సొంతపార్టీ ఎంపీ కునాల్ ఘోష్ మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. శారద కుంభకోణంలో అతిబెద్ద లభ్దిదారు మమతా బెనర్జీయేనని ఆరోపించారు. తన్ను తాను రక్షించుకునేందుకు పార్టీ సమావేశాలు పెట్టి ఆరోపణలు గుప్పిస్తున్నారని విమర్శించారు. కాగా, మమత ఆరోపణలపై బీజేపీ స్పందించింది. ఆమె ఆరోపణలు శారద కుంభకోణం నిందితులకు సాయపడేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ‘ఆమె గట్టి పోరాట యోధురాలే, సీపీఎం పాలనను అంతమొందించి పశ్చమ బెంగాల్లో పెద్దమార్పే తెచ్చారు. ఆమెతో మేంకూడా కలసిపనిచేశాం. అయితే, ఇపుడు కేంద్రంపై ఇలాంటి ఆరోపణలు చేయడం నిందితులకే ఉపయోపడుతుంది. అందుకు బదులుగా నిందుతులను దూరంగా పెడితే బాగుంటుంది’ అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు సూచించారు. -
దమ్ముంటే రాష్ట్రపతి పాలన పెట్టండి!
మోదీ సర్కార్‌కు మమతా బెనర్జీ సవాల్ కేంద్రం కక్ష సాధిస్తోంది కోల్‌కతా: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తనపైనా.. తన పార్టీపైనా కక్ష సాధింపునకు పాల్పడుతోందని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆరోపించారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని, బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సవాల్ విసిరారు. శారదా కుంభకోణంలో తృణమూల్ ఎంపీ సృంజోయ్ బోస్ అరెస్ట్ నేపథ్యంలో కేంద్రంపై మమత విరుచుకుపడ్డారు. శనివారమిక్కడ జరిగిన పార్టీ సమావేశంలో ఆమె ప్రసంగించారు. బీజేపీకి భయపడాల్సిన పనిలేదని, పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను సమైక్యంగా ఎదుర్కోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు నోరెత్తకూడదని వారు భావిస్తున్నారని, అందుకే సోనియా కూడా నోరు విప్పడం లేదని, తానంటే భయపడుతున్నారని, తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తమపై దాడి జరిగితే ప్రతిఘటిస్తామని, ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రజల కోసమే తాము పని చేస్తామని, రాజకీయ కక్ష సాధింపులపై తమ పోరాటం ఇప్పుడే ప్రారంభమైందన్నారు. సృంజోయ్ అరెస్ట్‌ను మమత ప్రస్తావిస్తూ.. వాస్తవానికి బీజేపీ తననే లక్ష్యంగా చేసుకుందని, ఢిల్లీలో సెక్యులర్ పార్టీలు ఏర్పాటు చేసిన సదస్సుకు తాను హాజరుకావడమే దీనికి కారణమని ఆరోపించారు. తమ ఎంపీని అరెస్ట్ చేయడం ద్వారా తనపై పగ తీర్చుకున్నారన్నారు. ఇటువంటి వందలు, వేల సదస్సులకు హాజరవుతానని ప్రకటించారు. అల్లర్లకు సంబంధించి అనేక కేసులు ఎదుర్కొంటున్న వారు తమ వైపు ఎలా వేలు చూపిస్తున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి ఇన్చార్జిగా చెప్పుకుంటున్న వ్యక్తి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఎన్ని రోజులు దేశంలో ఉన్నారని మోదీని ఉద్దేశించి ప్రశ్నించారు. సీబీఐ చీఫ్ రంజిత్‌సిన్హాను 2జీ కేసు దర్యాప్తు నుంచి తొలగించాలని ఆదేశించాడన్ని ప్రస్తావిస్తూ.. సీబీఐ విశ్వసనీయతను సుప్రీంకోర్టే తప్పుపట్టిందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో చర్చించారు.