
ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన దీదీ (ఫోటో కర్టెసీ: రిపబ్లిక్ వరల్డ్)
దాదాపు 48 గంటల పాటు దీదీని అబ్జర్వేషన్‌లో ఉంచారు
కోల్‌కతా: రెండు రోజుల క్రితం నందిగ్రామ్ ర్యాలీలో భాగంగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దీదీ శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. వీల్‌చైర్ సాయంతో తన నివాసానికి చేరుకున్నారు. దాదాపు 48 గంటల పాటు దీదీని అబ్జర్వేషన్‌లో ఉంచారు వైద్యులు. ఈ క్రమంలో ఆమెని డిశ్చార్జ్ చేయాల్సిందిగా పార్టీ నాయకులు పదే పదే కోరడంతో ఆస్పత్రి వర్గాలు దీదీని డిశ్చార్జ్ చేశాయి. ప్రస్తుతం దీదీ ఆరోగ్యంగానే ఉన్నారని.. మరి కొన్ని రోజుల పాటు ఆమెకు విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు.
నందిగ్రామ్‌లో నామినేషన్ వేసి వస్తుండగా.. మమత ప్రమాదానికి గురయ్యారు. తనపై నలుగురైదురు వ్యక్తులు దాడి చేశారని.. కుట్ర ప్రకారమే ఇలా జరిగిందని మమత ఆరోపించగా.. ప్రత్యక్ష సాక్షులు మాత్రం దీదీని చూడ్డానికి జనాలు భారీ ఎత్తున రావడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.