
సాక్షి,కోల్‌కతా: తాజ్ మహల్ దేశ సంస్కృతికి మచ్చని బీజేపీ ఎంఎల్‌ఏ సంగీత్ సోమ్ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశం పేరునూ మార్చేందుకు బీజేపీ ప్రయత్నించే రోజులు ఎంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. బీజేపీ రాజకీయ అజెండానే సంగీత్ సోమ్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. బీజేపీ అనుసరిస్తున్నది ప్రజాస్వామ్యం కాదని అవి నియంతృత్వ పోకడలేనని ఆరోపించారు.
దేశంలో భిన్న మతాలు, కులాలు, వర్గాలు, జాతులకు చెందిన ప్రజలున్నారని, దేశ ఐక్యత, సమగ్రతలకు విఘాతం కల్పించేలా ఏ ఒక్కరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించాలని సూచించారు. మత ప్రాతిపదికన చేసే ఇలాంటి వ్యాఖ్యలు దేశ వారసత్వ, చారిత్రక విలువలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. తాజ్‌మహల్‌పై బీజేపీ ఎంఎల్‌ఏ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు.బీజేపీ నేతలు అభివృద్ధిని పక్కనపెట్టి విద్వేష రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment