
సాక్షి, హైదరాబాద్: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శునకాలకున్న గౌరవం కూడా ముస్లింలకు లేదని అన్నారు. ముస్లింలను బూచిగ చూపెట్టి ఆర్‌ఎస్‌ఎస్ విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
దేశంలో ముస్లింలు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిన అవసరం లేదన్నారు. ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన అధికారాలు ఉన్నాయని చెప్పారు. ఒకప్పుడు నన్ను బీజేపీ బీ-టీమ్‌గా పిలిచిన మమతా బెనర్జీ ఇప్పుడు ఆర్‌ఆర్‌ఎస్, మోదీలను పొగుడుతున్నారని ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.