
భారత దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు సురజిత్ సేన్ గుప్తా(71) కన్నుమూశారు. కోల్‌కతా లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందూతూ ఆయన గురువారం తుది శ్వాస విడిచారు. కాగా కరోనా బారిన పడిన సురజిత్ జనవరి 23న ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్ సాయంతో గత కొన్ని రోజులుగా ఆయనకు చికిత్స అందించారు.
కాగా సురజిత్ సేన్ గుప్తా భారత ఫుట్ బాల్ జట్టు కు మిడ్ ఫిల్డర్ గా సేవలు అందించారు. 1970 ఆసియా గేమ్స్ లో భారత్ కాస్య పతకం సాధించడంలో సురజిత్ సేన్ గుప్తా కీలక పాత్ర పోషించారు. సురజిత్ సేన్ గుప్తా మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.
చదవండి: 13 బంతుల్లో సునామీ ఇన్నింగ్స్... బంతితోను బ్యాటర్లకు చుక్కలు.. సీఎస్‌కే ఫ్యాన్స్‌కు ఇక..!