
కోల్‌కతా ఆర్‌జీకార్ ఆస్పత్రి అభయ ఘటనలో న్యాయం చేయాలనే డిమాండ్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అభయకు మద్దతుగా భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాల్లో 130 నగరాల్లో ప్రవాస భారతీయులు ఆందోళన చేపట్టారు.
జపాన్,ఆస్ట్రేలియా,తైవాన్,సింగపూర్,యూరప్ దేశాలతో పాటు అమెరికాలోని 60 ప్రాంతాల్లో అభయ కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో నేరాలకు జవాబుదారీతనం, భారతీయ మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రవాస భారతీయులు నల్ల దుస్తులు ధరించిన మహిళలు ఆందోళన తెలిపారు.
ఈ సందర్భంగా డ్యూటీలో ఉన్న అభయపై జరిగిన దారుణం ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. మానవ జీవితం పట్ల నిర్దాక్షిణ్యం,క్రూరత్వం,నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం అని ఆందోళన కారులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment