![Mamata Banerjee to Move Court Over Nandigram Verdict - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/3/69.jpg.webp?itok=youLnNMT)
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం మమతా బెనర్జీ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. విజయం అనంతరం దీదీ హింసాత్మక చర్యలకు దిగారంటూ.. బీజేపీ చేస్తోన్న ఆరోపణలని ఆమె ఖండించారు. కాషాయపార్టీ ప్రచారం చేస్తోన్న ఫోటోలు పాతవన్నారు. నందిగ్రామ్ ఫలితంపై దీదీ స్పందించారు. కౌంటింగ్‌లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించిన దీదీ.. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. జర్నలిస్ట్‌లను కోవిడ్ వారియర్స్‌గా ప్రకటించారు దీదీ.
ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. ‘‘మనం విజయం సాధించాం. ఇది బెంగాల్ ప్రజల విజయం. అయితే జనాలకు నాదొక విన్నపం. మనం శాంతియుతంగా ఉందాం. ఎన్నికల వేళ బీజేపీ, కేంద్ర బలగాలు మనలను చాలా ఇబ్బందులకు గురి చేశాయి. కానీ ఇప్పటికి కూడా మనం హింసకు పాల్పడవద్దు. మీరు ప్రశాంతంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే, పోలీసులకు నివేదించండి. వారిలో కొందరు బీజేపీ కోసం పనిచేసి ఉండవచ్చు. దాని గురించి తర్వాత ఆలోచిస్తాను. ఈ రోజు రాత్రి 7 గంటలకు గవర్నర్‌ను కలవనున్నాను’’ అన్నారు దీదీ.
నందిగ్రామ్ ఓట్ల లెక్కింపుపై దీదీ సందేహాలు వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘4 గంటలపాటు సర్వర్‌లో సమస్య ఉందని ఈసీ చెప్పింది. నేను గెలిచినట్లు తెలిసి గవర్నర్ అభినందనలు కూడా తెలిపారు.రీకౌంటింగ్‌కు అనుమతి ఇవ్వొద్దని ఆర్వోను బెదిరించారు. రీ కౌంటింగ్ నిర్వహిస్తే ప్రాణాపాయం ఉందని ఆర్వో అన్నట్లు తెలిసింది.ఆర్వో రాసిన లేఖ విషయం ఒకరు నాకు ఎస్‌ఎంఎస్ పంపారు. అండతోనే సువేంద్ గెలిచారు’’ అని మమత ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment