సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చీఫ్ అమిత్ షా అడుగుపెట్టకుండా ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అధికార బలంతో అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. మాల్ధా ఎయిర్‌పోర్ట్‌లో అమిత్ షా విమానం ల్యాండ్ అయ్యేందుకు హెలిప్యాడ్ వాడకానికి బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే అదే హెలిప్యాడ్‌లో కొద్ది రోజుల కిందట మమతా హెలికాఫ్టర్ ల్యాండ్ అయిందని, అక్కడికి మీడియా ప్రతినిధులు కూడా వెళ్లారని ఆ ప్రదేశం శుభ్రంగా, సురక్షితంగా ఉండటం తాను చూశాననన్నారు. అక్కడ హెలికాఫ్టర్లు బాగానే ల్యాండవుతాయని చెప్పుకొచ్చారు. భద్రతా కారణాలు సాకు చూపి అక్రమ పద్ధతుల్లో అమిత్ షా విమానం ల్యాండయ్యేందుకు అనుమతి నిరాకరించారని ఆయన ఆరోపించారు. ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చే అమిత్ షా విమానం దిగేందుకు మాల్దా ఎయిర్‌పోర్ట్ వర్గాలు అనుమతి నిరాకరించడంపై బీజేపీ నేతలు మమతా సర్కార్‌పై భగ్గుమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment