permission denied
-
కట్టుబడినందుకు కట్టడి చేశారు
అమెరికాలో దాదాపు వందకు పైగా సంచలనాత్మక కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేసిన డొనాల్డ్ ట్రంప్ అక్కడి అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థపై కత్తిగట్టారు. అమెరికా తీరప్రాంతమైన ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మారుస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయినాసరే పాత పేరునే తమ రోజువారీ వార్తల్లో, కథనాల్లో వినియోగిస్తామని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) కరాఖండీగా చెప్పింది. దీంతో అధ్యక్షుడి నిర్ణయాన్నే బేఖాతరు చేస్తారా అన్న ఆగ్రహంతో ట్రంప్ పాలనాయంత్రాంగం శుక్రవారం నుంచి ఏపీ పాత్రికేయులకు అధ్యక్షభవనం, ఎయిర్‌ఫోర్స్ వన్ అధ్యక్ష విమానంలో రిపోర్టింగ్ కోసం అనుమతి నిరాకరించింది. అన్ని దేశాల్లో దినపత్రికలు, మేగజైన్లు, ఇతర వార్తాసంస్థలకు రోజువారీ వార్తలు, కథనాలు అందించే ప్రపంచంలో అతిపెద్ద న్యూస్‌ఏజెన్సీల్లో ఏపీ కూడా ఒకటి. ఇంతటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే తమ ప్రతినిధులను అధ్యక్షభవనం వంటి ముఖ్యమైన చోటుకు రానివ్వకపోవడంపై ‘ఏపీ’తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇది వార్తాస్వేచ్ఛను అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించింది. దీనిపై ట్రంప్ ప్రభుత్వం స్పందించింది. ‘‘అధ్యక్షుని నిర్ణయాన్ని బేఖాతరు చేయడమంటే వార్తల్లో విభజన తెచ్చే సాహసం చేయడమే. పైగా తప్పుడు విషయాన్ని అందరికీ చేరవేయడమే. అధ్యక్షుని నిర్ణయానికి గౌరవం ఇవ్వని వ్యక్తులకు వైట్‌హౌస్‌లో, ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో తగు స్థానం లేదు. ఆ స్థానాన్ని ఇన్నాళ్లూ వైట్‌హౌస్‌లోకి రాలేక రిపోర్టింగ్ చేయలేకపోయినా ఇతర మీడియా ప్రతినిధులకు కల్పిస్తాం’’అని వైట్‌హౌస్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ టేలర్ బుడోవిచ్ వాదించారు. దీనిపై ఏపీ మళ్లీ స్పందించింది. ‘‘అమెరికన్ వినియోగదారులను మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వినియోగదారులకు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’అనే పేరు వాస్తవం. ఆ దృక్కోణంలో పాత పేరుకే కట్టుబడి ఉన్నాం. ఈ విషయంలో అధ్యక్షుడు కార్యనిర్వాహక ఉత్తర్వును ధిక్కరించినట్లుగా భావించకూడదు’’అని ఏపీ స్పష్టంచేసింది. దశాబ్దాలుగా పూల్ రిపోర్టర్‌గా.. ప్రముఖ మీడియా సంస్థల కొద్దిపాటి మీడియా ప్రతినిధులు, కెమెరామెన్లకు మాత్రమే వైట్‌హౌస్, ఎయిర్‌ఫోర్స్ వన్ వంటి కీలక ప్రదేశాల్లోకి అనుమతిస్తారు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతోంది. నాటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ ఏ గార్ఫీల్డ్ హత్యోదంతం తర్వాత కొద్దిమంది మీడియా వాళ్లనే అనుమతించడం మొదలెట్టారు. ఇది 1881 ఏడాదినుంచి మొదలైంది. ఈ మీడియా బృంద సభ్యులను పూల్ రిపోర్టర్ అంటారు. ‘ఏపీ’ప్రతినిధి చాన్నాళ్లుగా ఇలా పూల్ రిపోర్టర్‌గా కొనసాగుతున్నారు. తమను లోపలికి అనుమతించకపోవడం పూర్తి వివక్షాపూరిత నిర్ణయం అని ఏపీ ప్రతినిధి ఒకరు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయాలని ‘ఏపీ’భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఏపీనే బయటకు గెంటేయడంపై వైట్‌హౌస్‌లోని ‘ది వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్(డబ్ల్యూహెచ్‌సీఏ)’తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘ప్రస్తుతానికైతే ఏపీకి బదులు రొటేషన్‌లో భాగంగా వేరే ప్రతినిధికి అవకాశం కల్పిస్తాం. సాధారణంగా ప్రతి రోజూ రొటేషన్‌లో ఏపీకి అవకాశం ఉంటుంది. కానీ ఇలా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. భావప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లజేస్తూ ప్రభుత్వం సెన్సార్‌షిప్‌కు తెరలేపుతోంది’’అని డబ్ల్యూహెచ్‌సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేటీఆర్ ధర్నాకు అనుమతి నిరాకరణ!
మహబూబాబాద్ రూరల్: ‘లగచర్ల’గిరిజనులకు సంఘీభావంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనితో బీఆర్ఎస్ నేతలు ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట బుధవారం రాత్రి ధర్నాకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎంపీ మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు తదితరులు ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘మహాధర్నాకు అనుమతి కోసం రెండు రోజులుగా ప్రయతి్నస్తున్నాం. తొలుత అనుమతి ఇస్తామని పోలీసులు చూచాయగా చెప్పారు. తీరా ఎస్పీ అనుమతి ఇవ్వలేమంటూ నిరాకరించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పిరికి పంద చర్య’’అని నేతలు మండిపడ్డారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి దాకా ఎస్పీ కార్యాలయంలో కూర్చోబెట్టి చివరి నిమిషంలో అనుమతి ఇవ్వబోమని చెప్పటం ఏమిటని నిలదీశారు. ధర్నా సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా నియంత్రించలేమని, పోలీసులు చెప్పటం చూస్తే వారి దుస్థితి ఏమిటో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగినా... పోలీసుల నుంచి స్పందన రాలేదు. దీనితో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అక్కడే నిద్రకు ఉపక్రమించారు. ఈ ధర్నాలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, ఇతర బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. -
సమస్యలు సృష్టిస్తుంటే యాత్రకు అనుమతులు రద్దుచేయండి
సాక్షి, అమరావతి: సమస్యలు సృష్టిస్తున్నారనుకుంటే యువగళం యాత్రకు అనుమతులు రద్దుచేయండని హైకోర్టు పేర్కొంది. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రజలపై దాడులు చేయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మంగళవారం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద జరిగిన ఘటనపై ముదివేడు పోలీసులు తమపై నమోదు చేసిన కేసుల్లో, అలాగే పుంగనూరు ఘటనలో పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ టీడీపీ నేతలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. పశ్చిమ గోదావరి జిల్లా యువగళం యాత్రలో భాగంగా మందలపర్రు గ్రామంలో లోకేశ్ చర్చి వైపు వేలు చూపిస్తూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని, దీంతో ఆ పార్టీ కార్యకర్తలు వెళ్లి చర్చిలో ప్రార్థనలు చేస్తున్న వారిపై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారని చెప్పారు. లోకేశ్ బహిరంగంగానే టీడీపీ శ్రేణులను దాడులకు ఉసిగొల్పుతున్నారని తెలిపారు. కనీసం 12 నుంచి 20 కేసులున్న కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించే బాధ్యత తనదంటూ లోకేశ్ ప్రతి సభలోను బహిరంగంగా చెబుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను సైతం చూడవచ్చన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులోను చంద్రబాబునాయుడు ఇదే రీతిలో టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పి పోలీసులపై దాడులు చేయించి తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. అందుకే పుంగనూరు ఘటనలో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ నేతలు పెట్టుకున్న పిటిషన్లను తీవ్రంగా వ్యతిరేకించామని, ముందస్తు బెయిల్ ఇస్తే ఇలాంటి ఘటనలు పునరావృత్తం చేస్తూ ఉంటారని ఆ రోజు మొత్తుకున్నామని చెప్పారు. ఆ రోజున తాము వ్యక్తం చేసిన ఆందోళన ఈ రోజు నిజమైందన్నారు. పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకునే ఆ రోజున టీడీపీ నేతల అరాచకాలు ఎలా ఉంటాయో స్పష్టంగా వివరించామని తెలిపారు. కేసులు పెడితే వెంటనే హైకోర్టుకు వస్తున్నారన్నారు. అదే వారి ధైర్యమని చెప్పారు. ఈ సమయంలో న్యాయస్థానం స్పందిస్తూ.. సమస్యలు సృష్టిస్తున్నారనుకుంటే యువగళం యాత్రకు అనుమతులు రద్దుచేయండని స్పష్టం చేసింది. ‘మీరు (ప్రభుత్వం) ఇచ్చిన అనుమతితోనే కదా యాత్ర చేస్తున్నది. అలాంటప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? అనుమతులు రద్దుచేయవచ్చు కదా?’ అని ఏఏజీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. లోకేశ్ పాదయాత్ర గురించి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతున్నప్పుడు టీడీపీ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పెద్దగా అరుస్తూ.. ప్రస్తుత కేసులతో లోకేశ్ పాదయాత్రకు ఎలాంటి సంబంధం లేదని, యువగళం ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. టీడీపీ న్యాయవాదులు గొంతు పెద్దదిగా చేసి మాట్లాడుతుండటంతో న్యాయస్థానం వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదేమన్నా చేపల మార్కెట్ అనుకుంటున్నారా? లేక కోర్టు అనుకుంటున్నారా? అంటూ వారిని మందలించింది. ఏఏజీ వాదనలు వినిపిస్తున్నప్పుడు మధ్యలో ఇలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించింది. ఆయన వాదనలకు సమాధానం ఇచ్చేందుకు మీకు అవకాశం వచ్చినప్పుడు అన్నీ చెప్పుకోవాలే తప్ప ఇలా చేపల మార్కెట్లో అరిచినట్లు అరవడం ఏమిటంటూ అసహనం వ్యక్తం చేసింది. ఏ రకమైన ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదు గతంలో ఇతర నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇచ్చిన ఉత్తర్వులను తాజా వ్యాజ్యాల్లోనూ ఇస్తూ ఆ వ్యాజ్యాలను పరిష్కరించాలని టీడీపీ న్యాయవాదులు గింజుపల్లి సుబ్బారావు, ఎం.లక్ష్మీనారాయణ, పుల్లగూర నాగరాజు తదితరులు కోరారు. సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు అలా చేయడం సరికాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కనీసం కఠిన చర్యలేవీ తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని వారు అభ్యర్థించారు. అలాంటి ఉత్తర్వులేవీ ఇవ్వడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో విచారణను ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. వేర్వేరు పిటిషన్లు వేసిన టీడీపీ నేతలు అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద జరిగిన ఘటనపై ముదివేడు పోలీసులు తమపై నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ టీడీపీ నేతలు భూమిరెడ్డి రాంభూపాల్‌రెడ్డి, గంటా నరహరి, షాజహాన్ బాషా,దొమ్మాలపాటి రమేష్, శ్రీరామ్ చినబాబు, ఎం.రాంప్రసాద్‌రెడ్డి తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే చిత్తూరు జిల్లా పుంగనూరు ఘటనలో పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయా లంటూ టీడీపీ నేతలు వి.చంద్రశేఖర్, ఎం.రాంప్రసాద్రెడ్డివేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా విచారణ సబబు కాదు అంగళ్లు, పుంగనూరు ఘటనల్లో టీడీపీ నేతలు దేవినేని ఉమా, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, పులివర్తి నాని, చల్లా బాబు తదితరులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము సుప్రీంకోర్టులో సవాలు చేశామని సుధాకర్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కోర్టు జారీచేసిన ఉత్తర్వుల్లోని పలు అంశాలను తాము సుప్రీంకోర్టు ముందు లేవనెత్తామన్నారు. టీడీపీ నేతల తీరుపై ఆందోళనతోనే వారికిచ్చిన ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేసినట్లు చెప్పారు. తమ పిటిషన్లకు సుప్రీంకోర్టులో డైరీ నంబర్ కూడా జారీ అయిందని, అయితే ఎప్పుడు విచారణకు వస్తాయో నిర్దిష్టంగా చెప్పలేమని తెలిపారు. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొందరు టీడీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను వాయిదా వేయడం సబబుగా ఉంటుందని కోర్టు భావిస్తే, అలాగే వాయిదా వేయచ్చన్నారు. న్యాయస్థానం స్పందిస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు అదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై తాము విచారించడం సబబుగా ఉండదని అభిప్రాయపడింది. -
బుద్ధిమారని పాక్.. టర్కీకి భారత్ సాయం అందకుండా మోకాలడ్డు!
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధి చాటుకుంది. భూకంపంతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న టర్కీకి సాయం అందించేందుకు వెళ్తున్న భారత యుద్ధ విమానాలు తమ గగనతలం మీద నుంచి వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో భారత సీ-17 యుద్ధ విమానం వెనక్కి వచ్చి వేరే దేశం మీదుగా టర్కీకి చేరుకోవాల్సి వచ్చింది. ఈమేరకు భారత మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే భారత యుద్ధవిమానాలు అసలు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లలేదని, ఇందుకు సంబంధించి ఎలాంటి అనుమతులు కూడా పాకిస్తాన్‌ను భారత్ అడగలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. భారత్‌లోని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ కూడా ఈ విషయంపై స్పందించారు. భారత యుద్ధవిమానాలు ఎగిరేందుకు పాకిస్తాన్ అనుమతి నిరాకరించిందనే విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. 2021లో కూడా అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పుడు భారతీయులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చింది కేంద్రం. అప్పుడు కూడా మనం పాక్ గగనతలాన్ని వినియోగించుకోలేదు. మన విమానాలు అఫ్గాన్ నుంచి ఇరాన్ మీదుగా భారత్ చేరుకున్నాయి. రెండు యుద్ధవిమానాలు.. భూకంపం అనంతరం టర్కీకి భారత్ తనవంతు సాయం చేస్తోంది. ఇప్పటివరకు రెండు యుద్ధ విమానాల్లో సహాయక సిబ్బంది, పరికరాలు, ఔషధాలను పంపింది. మొదటి యుద్ధ విమానం సోమవారం రాత్రే టర్కీ చేరుకోగా.. రెండో యుద్ధ విమానం మంగళవారం వేకువజామున టర్కీకి వెళ్లింది. ఈ విమానాల్లో జాతీయ విపత్తు నిర్వహణ దళాలు, ప్రత్యేక శిక్షణ తీసుకున్న డాగ్ స్క్వాడ్లు, డ్రిల్లింగ్ మెషీన్లు, ఔషధాలు, పరికరాలు సహా ఇతర సామగ్రిని భారత్ టర్కీకి పంపింది. First Indian C17 flight with more than 50 @NDRFHQ Search & Rescue personnel, specially trained dog squads,drilling machines, relief material, medicines and other necessary utilities & equipment reaches Adana,Türkiye. Second plane getting ready for departure. @MevlutCavusoglu pic.twitter.com/sSjuRJJrIO — Dr. S. Jaishankar (@DrSJaishankar) February 7, 2023 చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్.. -
Munawar Faruqui: మునావర్ ఫారుఖీ షోకు అనుమతి నిరాకరణ
న్యూఢిల్లీ: మునావర్ ఫారుఖీ షోకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే షో కోసం మునావర్ ఫారుఖీ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఢిల్లీలో మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని భావించడంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఫారూఖీ షో ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: (చర్లపల్లి జైలులో రాజాసింగ్.. పీడీ యాక్ట్ రివోక్‌పై ప్లాన్ ఫలిస్తుందా?) -
విరించి ఆస్పత్రిలో కోవిడ్ చికిత్సకు అనుమతులు రద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్సకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ హెల్త్ సెక్రటరీ రిజ్వి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. మీటింగ్ ముగిసిన గంటల వ్యవధిలోనే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రికి కోవిడ్ చికిత్సకు అనుమతులు రద్దు చేశారు. గతంలో కూడా విరించి ఆస్పత్రిపై చర్యలు తీసుకున్నప్పటికి.. తీరు మార్చుకోకపోవడం గమనార్హం. కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితుల నుంచి వందల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 64 ఆస్పత్రులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు పంపింది. హైదర్‌గూడ అపోలో, కిమ్స్, సోమాజీగూడ యశోద,విరించి ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులకు, మేడ్చల్ జిల్లా పరిధిలోని కూకట్పల్లి ఓమ్ని ,హైదరాబాద్ నర్సింగ్ హోమ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
రాష్ట్రపతి విమానానికి పాక్ అనుమతి నో
ఇస్లామాబాద్: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విమానం తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాక్ అనుమతి నిరాకరించింది. గగనతలాన్ని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ భారత్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించినట్లు పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి తెలిపారు. కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై పాక్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. తమ గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తామని దాదాపు నెల క్రితమే పాక్ ప్రకటించినా ఈ విషయమై అధికారింగా ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు. తాజాగా, రాష్ట్రపతి కోవింద్ విమానానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ స్పందిస్తూ.. ప్రముఖ వ్యక్తులు ప్రయాణించే విమానాలను ఏ దేశమైనా సాధారణంగా అనుమతిస్తుంది. పాక్ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం’అని పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి కోవింద్ సోమవారం నుంచి ఐస్లాండ్, స్విట్జర్లాండ్, స్లొవేనియా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఉగ్రవాదంతో దేశం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించనున్నారు. -
మరోసారి అమిత్‌షాకు చుక్కెదురు
కోల్‌కతా : ఎన్నికల ప్రచారం కోసం పశ్చిమబెంగాల్ పర్యటనకు సిద్ధమైన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ర్యాలీకి బెంగాల్ ప్రభుత్వం చివరి నిమిషంలో అనుమతి నిరాకరించింది. దాంతో బెంగాల్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మే 19న ఎన్నికలు జరిగే జాధవ్‌పూర్‌లో అమిత్ షా సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆయన ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అంతేగాక.. షా చాపర్ ల్యాండింగ్‌కు ఇచ్చిన అనుమతిని కూడా వెనక్కితీసుకుంది. కాగా, దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. ‘తృణమూల్ కాంగ్రెస్ అప్రజాస్వామిక చర్యల పట్ల ఈసీ మౌనంగా ఉండటం దురదృష్టకరం. దీనిపై మేం ఆందోళన చేపడతాం’ అని బీజేపీ రాజ్యసభ ఎంపీ అనిల్ బాలుని తెలిపారు. బెంగాల్ ప్రభుత్వం నుంచి అమిత్ షాకు గతంలోనూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఈ ఏడాది జనవరిలో అమిత్ షా మాల్దాలో దిగేందుకు ఆయన హెలికాప్టర్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు బీజేపీ నేతల చాపర్ల ల్యాండింగ్‌కు కూడా దీదీ సర్కార్ అనుమతించకపోవడం గమనార్హం. -
‘అధికార బలంతో అమిత్ షాను అడ్డుకుంటున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో బీజేపీ చీఫ్ అమిత్ షా అడుగుపెట్టకుండా ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అధికార బలంతో అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. మాల్ధా ఎయిర్‌పోర్ట్‌లో అమిత్ షా విమానం ల్యాండ్ అయ్యేందుకు హెలిప్యాడ్ వాడకానికి బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అదే హెలిప్యాడ్‌లో కొద్ది రోజుల కిందట మమతా హెలికాఫ్టర్ ల్యాండ్ అయిందని, అక్కడికి మీడియా ప్రతినిధులు కూడా వెళ్లారని ఆ ప్రదేశం శుభ్రంగా, సురక్షితంగా ఉండటం తాను చూశాననన్నారు. అక్కడ హెలికాఫ్టర్లు బాగానే ల్యాండవుతాయని చెప్పుకొచ్చారు. భద్రతా కారణాలు సాకు చూపి అక్రమ పద్ధతుల్లో అమిత్ షా విమానం ల్యాండయ్యేందుకు అనుమతి నిరాకరించారని ఆయన ఆరోపించారు. ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చే అమిత్ షా విమానం దిగేందుకు మాల్దా ఎయిర్పోర్ట్ వర్గాలు అనుమతి నిరాకరించడంపై బీజేపీ నేతలు మమతా సర్కార్‌పై భగ్గుమంటున్నారు. -
అమిత్ షా ర్యాలీకి ఆటంకం
కోల్‌కతా : బీజేపీ చీఫ్ అమిత్ షా ఆదివారం నిర్వహించే ర్యాలీకి హాజరయ్యేందుకు మాల్ధా ఎయిర్‌పోర్ట్‌లోని హెలిప్యాడ్‌ను వాడుకునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. విమానాశ్రయంలో హెలిప్యాడ్ ఉపయోగంలో లేదని, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులతో తాత్కాలిక హెలిప్యాడ్‌ను ఉపయోగించడం సాధ్యం కాదని మాల్ధా జిల్లా యంత్రాగం స్పష్టం చేసింది. హెలిప్యాడ్ వాడుకొనేందుకు అనుమతి నిరాకరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను పార్టీ స్ధానిక విభాగానికి మాల్ధా అదనపు జిల్లా మేజిస్ర్టేట్ శుక్రవారం తెలియచేశారు. కాగా అమిత్ షా పర్యటన కోసం హెలిప్యాడ్‌కు బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై బీజేపీ రాష్ట్ర శాఖ మండిపడింది. బీజేపీ నేతలు రాష్ట్రంలో ర్యాలీలు చేపట్టకుండా నిరోధించేందుకు తృణమూల్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆరోపించింది. కాగా రథయాత్రల స్ధానంలో బెంగాల్ అంతటా ర్యాలీలు నిర్వహించేందుకు సుప్రీం కోర్టు అనుమతించిన క్రమంలో బీజేపీ మాల్ధాలో ర్యాలీకి సన్నాహాలు చేసుకుంది. అమిత్ షా విమానం దిగేందుకు వీలుగా మరో ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. -
అమిత్ షా రధయాత్రకు హైకోర్టు నో
సాక్షి, కోల్‌కతా : బీజేపీ చీఫ్ అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహర్‌లో శుక్రవారం పాల్గొనాల్సిన రధయాత్రకు కలకత్తా హైకోర్టు గురువారం అనుమతి నిరాకరించింది. బెంగాల్ అంతటా పలు జిల్లాల్లో సాగే ఈ మెగా ర్యాలీనీ అమిత్ షా లాంఛనంగా ప్రారంభించాల్సి ఉంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో బీజేపీ బెంగాల్ శాఖ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 9న తదుపరి విచారణ చేపడతామని అప్పటివరకూ రధయాత్రను వాయిదా వేయాలని హైకోర్టు కోరింది. కాగా రధయాత్రకు అనుమతి నిరాకరించిన కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్‌లో సవాల్ చేస్తామని బీజేపీ బెంగాల్ ఇన్చార్జ్ విజయ్‌వర్గీయ వెల్లడించారు.కాగా, కూచ్‌బెహర్ సమస్యాత్మక ప్రాంతమని, అక్కడ ఇలాంటి ర్యాలీకి అనుమతిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. డిసెంబర్ ఏడు నుంచి రాష్ట్రంలో మూడు ర్యాలీలు చేపట్టేందుకు అనుమతి కోసం తాము దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వ అధికారులు, పోలీసుల నుంచి స్పందన లేదని పేర్కొంటూ బీజేపీ బుధవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. -
సన్నీకి మద్దతుగా హైకోర్టు వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూర్ : సన్నీ నైట్ షోపై కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న వేళ.. పోలీసులు అనుమతి నిరాకరించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సన్నీ షోను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ బెంగళూర్ పోలీసులను ప్రశ్నించింది. భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ పోలీసులు అనుమతి నిరాకరించటంతో షో నిర్వాహకులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న 18 రోజుల తర్వాత నిరాకరిస్తున్నట్లు చెప్పటం, అది కూడా భద్రతా కారణం అని చెప్పటం సహేతుకంగా లేదని వారు పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. కొత్త సంవత్సరం వేడుకల విషయంలో మిగతా క్లబ్ ఈవెంట్లపై లేని అభ్యంతరాలు కేవలం సన్నీలియోన్ షోపై మాత్రమే ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించింది. ఈ విషయంలో సన్నీ లియోన్ నుంచి స్పష్టమైన స్టేట్మెంట్ను రికార్డు చేయాలని.. డిసెంబర్ 31న నగరంలో ఎవరెవరికి అనుమతులు ఇచ్చారో జాబితా ను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని న్యాయమూర్తి బీ వీరప్ప ఆదేశించారు. తదుపరి విచారణను 25వ తేదీకి వాయిదా వేశారు. అనంతరం షో నిర్వాహకుడు, ది టైమ్స్ క్రియేషన్స్ యజమాని భవ్య హెచ్ఎస్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ ఏర్పాట్ల కోసం సుమారు 2.5 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు వివరించారు. దరఖాస్తు చేసుకున్న సమయంలో నాలుగైదు రోజుల్లో అనుమతులు ఇస్తామని పోలీస్ శాఖ చెప్పిందని.. ఇప్పుడు అభ్యంతరాల నేపథ్యంలో షో రద్దైతే తనకు భారీగా నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. కాగా, కర్ణాటక రక్షణ వేదిక యువ సేనే అభ్యంతరాల నేపథ్యం, సామూహిక ఆత్మహత్యల నేపథ్యంలో పోలీసులు అనుమతులకు వెనకడుగు వేస్తుండగా.. సన్నీ లియోన్ కూడా స్వచ్ఛందంగా షోకు రావట్లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. -
వారణాసిలో మోడీ మీటింగ్ కి నో పర్మిషన్
వారణాసి నుంచి లోకసభ పోటీ చేస్తున్న బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. వారణాసిలో ర్యాలీలు, రోడ్ షోకు అనుమతిని నిరాకరించింది. మోడీ గురువారం నాడు వారణాసిలో రెండు ర్యాలీలు, ఒక రోడ్ షో నిర్వహించవలసి ఉంది. అయితే ఈ అనుమతి నిరాకరణతో ఆయన రాక పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నరేంద్ర మోడీ వడోదర, వారణాసిలనుంచి పోటీ చేస్తున్నారు. వడోదర పోలింగ్ పూర్తయింది. వారణాసి లో మే 12 న పోలింగ్ జరగాల్సి ఉంది. అదే ఆఖరి విడత పోలింగ్ కావడం విశేషం. -
విశాఖ బీచ్‌రోడ్‌లో టీడీపీ సభపై అభ్యంతరాలు
-
ప్రజాగర్జన వేదికను తొలగిస్తాం
విశాఖపట్నంలో టీడీపీ నిర్వహించతలపెట్టిన ప్రజాగర్జన సభ తుస్సుమనేలాగే ఉంది. ఇప్పటివరకు ఆ సభ నిర్వహణకు అసలు అనుమతే రాలేదు. ఈరోజు మధ్యాహ్నం లోగా సభకు అనుమతి రాని పక్షంలో ఇప్పటికే అక్కడ ఏర్పాటుచేసిన సభా వేదికను తాము తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు టీడీపీ సభపై మత్స్యకారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీచ్ రోడ్డులో సభ నిర్వహిస్తే పర్యావరణం దెబ్బతింటుందని వారు అంటూ, ఈ మేరకు పర్యావరణ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సభను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. వాస్తవానికి ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్‌లో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ ఇంతకుముందే నిరాకరించింది. బీచ్ రోడ్డులో సభ ఏర్పాటుచేస్తే వాస్తుపరంగా అనుకూలంగా ఉండదని, అందువల్ల సభ ఎక్కడ నిర్వహించాలోనని తెలుగుదేశం పార్టీ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి.