
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్సకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ హెల్త్ సెక్రటరీ రిజ్వి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. మీటింగ్ ముగిసిన గంటల వ్యవధిలోనే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రికి కోవిడ్ చికిత్సకు అనుమతులు రద్దు చేశారు. గతంలో కూడా విరించి ఆస్పత్రిపై చర్యలు తీసుకున్నప్పటికి.. తీరు మార్చుకోకపోవడం గమనార్హం.
కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితుల నుంచి వందల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 64 ఆస్పత్రులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు పంపింది. హైదర్‌గూడ అపోలో, కిమ్స్, సోమాజీగూడ యశోద,విరించి ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులకు, మేడ్చల్ జిల్లా పరిధిలోని కూకట్‌పల్లి ఓమ్ని ,హైదరాబాద్ నర్సింగ్ హోమ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment