సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో శుక్రవారం అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు హెల్త్ సెక్రటరీ రిజ్వి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు దిశానిర్దేశం చేశారు. కరోనా చికిత్సకు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితుల నుంచి వందల ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పటికే 64 ఆస్పత్రులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు పంపింది. హైదర్‌గూడ అపోలో, కిమ్స్, సోమాజీగూడ యశోద,విరించి ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులకు, మేడ్చల్ జిల్లా పరిధిలోని కూకట్‌పల్లి ఓమ్ని ,హైదరాబాద్ నర్సింగ్ హోమ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment