సాక్షి, కోల్‌కతా : వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అదిర్ రంజన్ చౌదరి సవాల్ విసిరారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బెహ్రాంపూర్ స్థానం నుంచి తనపై పోటీ చేయాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను బెహ్రాంపూర్ లోక్‌సభ సీటును కేటాయింది. ఇప్పటికే ఆ స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన అదిర్ రంజన్.. యూసుఫ్ పఠాన్ ఎంపికపై స్పందించారు.
‘దేశంలోని పౌరులు ఎవరైనా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఓటు వేయోచ్చు. పోటీ చేయోచ్చు. మమత స్వయంగా వెళ్లి గోవాలో ఎటువంటి సమస్య లేకుండా బరిలోకి దిగొచ్చు. అయితే, ఒక్కసారైనా మమతా బెనర్జీ తనపై పోటీ చేయాలని సవాలు విసిరారు. తృణమూల్ కాంగ్రెస్ యూసుఫ్ పఠాన్‌ను గౌరవించాలనుకుంటే, బయటి వ్యక్తులను పంపే బదులు ఆయనను రాజ్యసభకు పంపించి ఉండాల్సిందని అధిర్ రంజన్ అన్నారు.
యూసఫ్ పఠాన్ పట్ల మమతా బెనర్జీకి చిత్తశుద్ధి ఉంటే, గుజరాత్‌లో అతనికి (యూసుఫ్ పఠాన్) సీటు ఇవ్వాలని కూటమి (ఇండియా కూటమి)ని అడిగారు. కానీ ఇక్కడ పశ్చిమ బెంగాల్ సీటు ఇచ్చారు. తద్వారా పరోక్షంగా బీజేపీకి సాయం చేసినట్లే చేసి.. కాంగ్రెస్‌ను ఓడించేలా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment