కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం చేశారు. ప్రారంభానికి ఒక రోజు ముందుగా బెంగాల్ ముఖ్యమంత్రి, గవర్నర్, మేయర్‌లకు ఆహ్వానాలు పంపారు. అయితే.. మెట్రో స్టేషన్ ఆహ్వానంపై అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ).. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించే విధానం ఇదేనా అంటూ ప్రశ్నించింది.
"ఆదివారం అర్ధరాత్రి ముఖ్యమంత్రి ఇంట‍్లో ఆహ్వానం పడేసి వెళ్లారు. ముఖ్యమంత్రిని ఆహ్వానించే విధానం ఇలాగేనా?. రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ ఈ మెట్రో ప్రాజెక్టును మంజూరు చేశారు. దీని కోసం రూ.2 లక్షల కోట్లు కేటాయించారు. అలాంటి వ్యక్తిని మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు." అని ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్.
మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవటంపై కోల్‌కతా రైల్ కార్పోరేషన్‌లో వివాదం చెలరేగింది. అది జరిగిన రెండో రోజు ఆహ్వానాన్ని సీఎం ఇంటికి పంపించినట్లు తెలిసింది. జులై 11న కేంద్ర మంత్రి స్మృతి ఇరాని మెట్రో స్టేషన్‌ను ప్రారంభిస్తారని కోల్‌కతా రైల్ కార్పోరేషన్ గత శనివారం ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత మమతా బెనర్జీని ఆహ్వానించకుండా కేంద్రం రాజకీయలు చేస్తోందని ఆరోపించింది టీఎంసీ. సీల్దా మెట్రో స్టేషన్ ఎదుట సోమవారం నిరసనలు చేపట్టాలని ముందుగా నిర్ణయించినా.. ఆ తర్వాత వెనక్కి తీసుకుంది టీఎంసీ.
ఇదీ చదవండి: 10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలోమీటర్లు నడిచి 'హజ్' యాత్ర
Comments
Please login to add a commentAdd a comment