కోల్‌కతా: మౌని అమావాస్య నాడు మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన నలుగురు మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన మమతా సర్కారు పశ్చిమ బెంగాల్ నుంచి కుంభమేళాకు వెళ్లేవారికి పలు సూచనలు జారీ చేసింది. ఒక హెల్ప్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
కుంభమేళాకు పశ్చిమబెంగాల్ నుంచి వెళుతున్న యాత్రికులకు ఏదైనా అత్యవసర పరిస్థితి(Emergency) తలెత్తినప్పుడు ఈ హెల్ప్‌డెస్క్ సాయం అందించనుంది. వారంలో ప్రతిరోజూ 24 గంటల పాటు సహాయం అందించేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ, పౌర రక్షణ శాఖ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ హెల్ప్‌డెస్క్(Helpdesk) పర్యవేక్షణ జరగనుందని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో యాత్రికులు మహా కుంభమేళాకు వెళ్తున్నారని, వారికి సహాయం చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు.
ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు హెల్ప్‌లైన్ నంబర్ (033) 2214-3526, టోల్-ఫ్రీ నంబర్ 1070ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో పశ్చిమ బెంగాల్(West Bengal)కు చెందిన నలుగురు యాత్రికులు మృతిచెందగా, తొమ్మిది మంది గల్లంతయ్యారు. ఇదిలావుండగా మహా కుంభమేళాలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల గణాంకాలను ప్రభుత్వం అందించాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.
బీజేపీ ప్రభుత్వాన్ని ఎవరూ విశ్వసించడం లేదన్న అఖిలేష్ ఒక ప్రకటనలో ఈ ప్రభుత్వానికి దేశ ప్రజల విషయంలో ఎలాంటి దార్శనికత లేదు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు, యువత, పేదలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ గణాంకాల కంటే, మహా కుంభ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన, గాయపడిన, తప్పిపోయిన వారి గణాంకాలు చాలా ముఖ్యమైనవని అఖిలేష్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి
Comments
Please login to add a commentAdd a comment