మమతా గాల్లో వస్తోంది.. గాల్లోనే మాయమవుతుంది | BJP Leader Suvendu Adhikari Comments On Mamata Banerjee | Sakshi
Sakshi News home page

మమతా గాల్లో వస్తోంది.. గాల్లోనే మాయమవుతుంది

Published Mon, Mar 29 2021 5:34 PM | Last Updated on Mon, Mar 29 2021 5:38 PM

BJP Leader Suvendu Adhikari Comments On Mamata Banerjee - Sakshi

నందిగ్రామ్‌ : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మైనారిటీలను బుజ్జగించటంలో మునిగిపోయారని, ఆమెకు ఓటు వేసి అధికారంలోకి రానిస్తే బెంగాల్‌ ఓ మినీ పాకిస్తాన్‌ అవుతుందని బీజేపీ నాయకుడు సువేధు అధికారి వ్యాఖ్యానించారు. సోమవారం నందిగ్రామ్‌లోని ఓ దేవాలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ మమతా బెనర్జీ తరచూ ఈద్‌ ముబారక్‌ అంటూ శుభాకాంక్షలు చెబుతుంది. అదే అలవాటుగా మారిపోయి ఇప్పుడు హోలీ రోజున కూడా హోలీ ముబారక్‌ అంటూ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతోంది. బేగం(బెనర్జీ)కి ఓటు వేయకండి. ఆమెకు ఓటు వేస్తే బెంగాల్‌ మినీ పాకిస్తాన్‌ అవుతుంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతోనే ఆమె గుళ్ల చుట్టూ తిరుగుతోంది.

యోగీ ఆధిత్యనాథ్‌ యూపీని పాలిస్తున్నట్లుగానే మేము కూడా బెంగాల్‌ని పాలిస్తాము. గతంలో ఆమె కారులో తిరిగేది. ఇప్పుడు హెలికాప్టర్‌లో తిరుగుతోంది. ఒకప్పుడు రూ. 400 చీర కట్టేది. ఇప్పుడు రూ. 6 వేల చీరకడుతోంది. ఒకప్పుడు అజంతా షూలు వాడేది.. ఇప్పుడు బ్రాండెడ్‌ షూలు వాడుతోంది. నేను మాత్రం ఏమీ మారలేదు. 2004నుంచి అలానే ఉన్నాను. మీకు బేగం(బెనర్జీ) కావాలో.. మీ కుమారుడు, సోదరుడు, ఓ మిత్రుడు కావాలో తేల్చుకోండి. మమతా గాల్లో వస్తోంది.. గాల్లోనే మాయమవుతుంది’’ అంటూ ఏద్దేవా చేశారు.

చదవండి, చదివించండి : 25 మంది మరణించారు.. 6 నెలల బాలుడు బ్రతికాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement