West Bengal Government Upgrades Sourav Ganguly Security To Z Category, Details Inside - Sakshi
Sakshi News home page

సౌరవ్ గంగూలీకి భద్రత పెంపు

May 17 2023 1:43 PM | Updated on May 17 2023 1:58 PM

West Bengal Government Upgrades Sourav Ganguly Security To Z Category - Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి భద్రత పెంచాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. గంగూలీకి ప్రస్తుతమున్న 'వై' కేటగిరీ భద్రత పదవీకాలం మే 16తో ముగియడంతో మమతా సర్కార్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాదా భద్రతను 'వై' నుంచి 'జెడ్‌' కేటగిరీకి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు మమతా సర్కార్‌ నిన్న అధికారికంగా వెల్లడించింది.

వై కేటగిరీ భద్రత ప్రకారం గంగూలీ నివాసం వద్ద ముగ్గురు స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులు, ముగ్గురు లా ఎన్‌ఫోర్సర్స్‌ (చట్టాన్ని అమలు చేసేవారు) ఉండేవారు. జెడ్‌ కేటగిరీ భద్రత ప్రకారం ఇకపై గంగూలీ భద్రత దళం సంఖ్య ఎనిమిది నుండి పది మంది పోలీసు అధికారులతో (24 గంటల పాలు) కూడినది ఉండనుంది.  గంగూలీ ప్రస్తుతం ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే, గంగూలీ సేవలందిస్తున్న ఢిల్లీ జట్టు ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో పేలవ ప్రదర్శనను కనబరుస్తూ అధికారికంగా లీగ్‌ నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ సీజన్‌లో ఇంకా 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు.

ఈ సీజన్‌ ప్రారంభానికి ముందు రెగ్యులర్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతని స్థానంలో డేవిడ్‌ వార్నర్‌ను కెప్టెన్‌గా నియమించారు. వార్నర్‌ వ్యక్తిగతంగా రాణించినా.. మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో డీసీకి ఈ గతి పట్టింది.

చదవండి: నీకు బౌన్సర్లు వేయడం మాత్రమే వచ్చా? నాపై రాహుల్‌ సీరియస్‌ అయ్యాడు: సిరాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement