టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ తన 51వ జన్మదినమైన జులై 8న ఓ ప్రత్యేకమైన ప్రకటన చేయనున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని దాదా తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ ద్వారా షేర్ చేశాడు. ఇందులో లీడింగ్ విత్ అంటూ డైరీలో రాస్తున్న తన ఫోటోను షేర్ చేస్తూ.. జూలై 8న నా పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రత్యేక ప్రకటన చేస్తున్నాను, వేచి ఉండండి అంటూ క్యాప్షన్ జోడించాడు.
ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. పుట్టిన రోజు గంగూలీ ఏం ప్రకటించబోతున్నాడో అని క్రికెట్ ఫాలోవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదా.. శుభవార్త చెబుతాడా లేక ఏదైనా బాంబు పేలుస్తాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. గంగూలీ గురించి తెలిసినవారైతే.. దాదా తన రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేయబోతున్నాడని అంటున్నారు. మరి గంగూలీ రేపు ఏ ప్రత్యేకమై ప్రకటన చేస్తాడో వేచి చూడాలి.
కాగా, ప్రస్తుతం గంగూలీ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్‌గా విధుల నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాదా ఆధ్వర్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌లో డీసీ చివరి స్థానంలో నిలిచింది. తన జమనాలో టీమిండియాను విజయవంతంగా ముందుండి నడిపించిన దాదా.. ఐపీఎల్‌లో తన జట్టుకు న్యాయం చేయలేకపోయాడు.
ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత కాస్త విరామం తీసుకున్న టీమిండియా.. జులై 12 నుంచి విండీస్‌తో వరస సిరీస్‌లతో బిజీ కానుంది. విండీస్ పర్యటనలో భారత్ తొలుత టెస్ట్ సిరీస్ (2 టెస్ట్‌లు), ఆతర్వాత వన్డే (3 వన్డేలు), టీ20 సిరీస్ (5 టీ20లు)లు ఆడుతుంది. ఈ మూడు సిరీస్‌ల కోసం భారత సెలక్టర్లు మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు.
విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
వన్డే సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, చహల్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్.
టీ20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
విండీస్ పర్యటన వివరాలు..
జులై 12-16- తొలి టెస్ట్, డొమినికా
జులై 20-24- రెండో టెస్ట్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్‌టౌన్
జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్‌టౌన్
ఆగస్ట్ 1- మూడో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
ఆగస్ట్ 4- తొలి టీ20, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
ఆగస్ట్ 6- రెండో టీ20, గయానా
ఆగస్ట్ 8- మూడో టీ20, గయానా
ఆగస్ట్ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా
ఆగస్ట్ 13- ఐదో టీ20, ఫ్లోరిడా
Comments
Please login to add a commentAdd a comment