west bengal government
-
నైట్ షిఫ్టులు వద్దంటారా?
న్యూఢిల్లీ: మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్దేశాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అలా చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ‘‘పైలట్లుగా, సైనికులుగా మహిళలు రాత్రి విధులు నిర్వహించడం లేదా? మీ నిర్దేశాలు మహిళా వైద్యుల కెరీర్‌పై ప్రభావం చూపుతాయి. రాత్రి విధుల్లో సమస్యలు ఎదుర్కోకుండా వారికి అవసరమైన భద్రత కలి్పంచడం ప్రభుత్వ బాధ్యత. అంతే తప్ప వాటిని మానుకోవాలని చెప్పడం సరికాదు’’ అంటూ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం మందలించింది. దాంతో సదరు నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటామని బెంగాల్ సర్కారు విన్నవించింది. కోల్‌కతాలో ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రిలో ట్రైనీ వైద్యురాలు రాత్రి విధుల్లో ఉండగా హత్యాచారానికి గురవడం, ఈ ఉదంతం దేశవ్యాప్త ఆందోళనలకు దారితీయడం తెలిసిందే. దాంతో నెల రోజులకు పైగా మమత సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో మహిళా వైద్యుల భద్రత నిమిత్తం సలహాలు, సూచనలతో ‘రాతిరేర్ సాథి’ పేరిట ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. వైద్యురాలి హత్యాచారోదంతంపై విచారణ సందర్భంగా మంగళవారం ఈ అంశం ధర్మాసనం దృష్టికి రావడంతో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించింది. ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది భద్రత నిమిత్తం కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రైవేట్ సెక్యూరిటీని నియమించాలన్న నిర్ణయాన్ని కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘వైద్యులకు భద్రతే లేని పరిస్థితి నెలకొని ఉంది. కనుక ప్రభుత్వాసుపత్రుల్లో పోలీసు సిబ్బందినైనా నియమించడం రాష్ట్ర ప్రభుత్వ కనీస బాధ్యత. వాటిలో యువ వైద్య విద్యార్థులు, ఇంటర్న్లు పని చేస్తున్నారు’’ అని గుర్తు చేసింది. మా లాయర్లకు బెదిరింపులు: సిబల్ ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. ‘‘ఇది ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్న కేసు. దీని విచారణ ఎలా జరుగుతోందో దేశ ప్రజలంతా తెలుసుకుని తీరాలి’’ అని స్పష్టం చేసింది. ప్రత్యక్ష ప్రసారం తమ లాయర్ల బృందానికి సమస్యలు సృష్టిస్తోందని సిబల్ వాదించారు. ‘‘ఇది విపరీతమైన భావోద్వేగాలతో కూడిన కేసు. మేం వాదిస్తోంది బాధితురాలి తరఫున కాదు గనుక మా బృందంలోని మహిళా లాయర్లకు యాసిడ్ దాడులు, అత్యాచారాలు చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. పైగా మా క్లయింట్ (బెంగాల్ సర్కారు) గురించి ధర్మాసనం ఎలాంటి వ్యాఖ్యలు చేసినా లాయర్లుగా పేరుప్రఖ్యాతు లన్నీ మట్టిలో కలిసిపోతున్నాయి’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. లాయర్లకు రక్షణ లభించేలా జోక్యం చేసుకుంటామని ధర్మాసనం హామీ ఇచి్చంది. ప్రత్యక్ష ప్రసారాన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మమత రాజీనామాకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఇదేమీ రాజకీయ వేదిక కాదంటూ సదరు న్యాయవాదికి తలంటింది.సీరియస్ అంశాలివి! వైద్యురాలి కేసులో దర్యాప్తు ప్రగతిపై సీబీఐ సమరి్పంచిన స్థాయీ నివేదికను సీజేఐ ధర్మాసనం మంగళవారం పరిశీలనకు స్వీకరించింది. అందులోని అంశాలు తమనెంతగానో కలచివేశాయంటూ ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచి్చంది. ‘‘నివేదికలో సీబీఐ పేర్కొన్నవి చాలా సీరియస్ అంశాలు. వాటిని చదివిన మీదట మేమెంతో ఆందోళనకు లోనవుతున్నాం. అయితే వాటిని ఈ దశలో వెల్లడించలేం. అది తదుపరి దర్యాప్తుకు విఘాతం కలిగించవచ్చు’’ అని పేర్కొంది. ‘‘జరిగిన దారుణానికి సంబంధించి మృతురాలి తండ్రి కొన్ని విలువైన అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. వాటిపైనా దర్యాప్తు చేయండి’’ అని సీబీఐకి సూచించింది. ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రి ఆర్థిక అవకతవకల కేసు దర్యాప్తుపైనా స్థాయీ నివేదిక సమరి్పంచ్సాలిందిగా నిర్దేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.పేరు, ఫొటో తొలగించండి హతురాలి పేరు, ఫొటో ఇప్పటికీ వికీపీడియాలో కనిపిస్తున్నట్టు సీబీఐ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దాంతో వాటిని తక్షణం తొలగించాలని వికీపీడియాను ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో తామిచి్చన గత ఆదేశాలకు కట్టుబడాలని స్పష్టం చేసింది. సమ్మె, ఆందోళనలు చేస్తున్న జూనియర్ వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలూ చేపట్టబోమని బెంగాల్ ప్రభుత్వం ఈ సందర్భంగా హామీ ఇచి్చంది. వైద్యురాలిపై అఘాయిత్యం జరుగుతుండగా అక్కడ ఎవరెవరున్నదీ జూనియర్ వైద్యులకు తెలుసని వారి తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ సమాచారాన్ని సీబీఐకి సీల్డ్కవర్లో అందజేస్తామన్నారు. తక్షణం విధుల్లో చేరాల్సిందిగా డాక్టర్లకు ధర్మాసనం మరోసారి సూచించింది. -
మీరిక వెళ్లొచ్చు
కోల్‌కతా: రోజంతా హైడ్రామా తర్వాత బెంగాల్ ప్రభుత్వం, జూనియర్ డాక్టర్లకు మధ్య శనివారం చర్చలు అసలు ప్రారంభమే కాలేదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యర్థన మేరకు ‘ప్రత్యక్ష ప్రసారం’ డిమాండ్‌ను పక్కనబెట్టి చర్చలకు సిద్ధపడ్డ జూనియర్ డాక్టర్లను ఆకస్మాత్తుగా సీఎం నివాసం దగ్గర నుంచి పంపేశారు. చాలా మొరటుగా మీరికి వెళ్లిపోవచ్చని చెప్పారని జూడాలు ఆరోపించారు. ‘చర్చలకు ఆహ్వానించడంతో సీఎం నివాసానికి వచ్చాం. ప్రత్యక్షప్రసారం లేదా వీడియో రికార్డింగు ఉండాలని డిమాండ్ చేశాం. సీఎం మమతా బెనర్జీ బయటకు వచ్చి చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం మినిట్స్‌ను మాకు ఇస్తామని హామీ ఇచ్చారు. మాలో మేము చర్చింకున్నాం. సీఎం విజ్ఞప్తి మేరకు ప్రత్యక్షప్రసారం, వీడియో రికార్డింగు లేకుండా చర్చలకు అంగీకరించాం. ఇదే విషయాన్ని ఆరోగ్యమంత్రి చంద్రిమ భట్టాచార్యకు తెలుపగా.. ఇక చాలు మీరు వెళ్లిపోండని ఆమె చెప్పారు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, మీకోసం మూడు గంటలుగా వేచిచూస్తున్నామని తెలిపారు. అర్ధంతరంగా మమ్మల్ని పంపేశారు’ అని సీఎం నివాసం వద్ద జూనియర్ డాక్టర్లు మీడియాతో వాపోయారు. చర్చలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ‘ఈ ఉదంతం ప్రభుత్వం అసలు రంగును బయటపెట్టింది. చర్చలపై ఎవరికి చిత్తశుద్ధి లేదో తెలుపుతోంది’ అని ఒక జూనియర్ డాక్టర్ కన్నీరుపెట్టుకుంటూ అన్నారు. ‘ఈ రోజుకు ఇక ముగిసినట్లే. మూడు గంటలుగా మేం వేచిచూస్తున్నాం. మీరు సీఎం నివాసం లోపలికి రాలేదు. ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది (రాత్రి అయిందని)’ అని ఆరోగ్యమంత్రి చంద్రిమ అంటున్న వీడియోను జూడాలు మీడియాకు షేర్ చేశారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారాన్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్ జూనియర్ డాక్టర్లు నెలరోజులకు పైగా విధులను బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే. సెపె్టంబరు 10న సాయంత్రానికల్లా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ సమ్మె కొనసాగిస్తున్నారు. చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. జూడాల డిమాండ్ మేరకు స్వయంగా చర్చల్లో పాల్గొనడానికి మమత అంగీకరించారు. ప్రత్యక్షప్రసారంపై పీటముడి పడినా.. చివరకు శనివారం జూడాలు దానిపై వెనక్కితగ్గారు. అయినా సర్కారు వైఖరితో చర్చలు సాధ్యపడలేదు. ఎన్నిసార్లు నన్నిలా అవమానిస్తారు: మమత అంతకుముందు సీఎం నివాసం వద్దకు చేరుకొని జూనియర్ డాక్టర్లు చర్చల ప్రత్యక్షప్రసారం డిమాండ్‌తో బయటే నిలబడిపోయా రు. వర్షంలో తడుస్తూ అలాగే నిలబడ్డారు. దాంతో సీఎం మమత బయటకు వచి్చ.. ‘మీరందరూ లోపలికి వచ్చి చర్చల్లో పాల్గొనాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. వైద్యురాలి హత్యాచారం కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రత్యక్షప్రసారం సాధ్యం కాదు. చర్చలను వీడియో రికార్డు చేసి.. సుప్రీంకోర్టు అనుమతితో మీకొక కాపీ అందజేస్తాం. ఈ రోజు సమావేశమవుదామని మీరే కోరారు. మీకోసం వేచిచూస్తున్నా. మీరెందుకు నన్నిలా అవమానిస్తున్నారు. దయచేసి నన్నిలా అవమానించొద్దు. ఇదివరకు కూడా మూడుసార్లు మీకోసం ఎదురుచూస్తూ కూర్చున్నా. కానీ మీరు రాలేదు’ అని మమత జూడాలతో అన్నారు. జూడాల శిబిరం వద్ద ప్రత్యక్షం శనివారం ఉదయం అందరినీ ఆశ్చర్యపరుస్తూ సీఎం మమతా బెనర్జీ స్వయంగా జూనియర్ డాక్టర్ల వద్దకు వచ్చారు. ఐదురోజులుగా జూడాలు బైఠాయించిన స్వాస్థ్య భవన్ (ఆరోగ్యశాఖ కార్యాలయం) వద్దకు చేరుకున్నారు. జూడాల డిమాండ్లను పరిశీలిస్తానని, ఎవరైనా తప్పుచేశారని తేలితే వారిపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మెడికోలు వర్షాలకు తడుస్తూ రోడ్డుపై ఆందోళనలు కొనసాగిస్తుంటే తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని చెప్పారు. తానిక్కడి రావడం సమస్య పరిష్కారం దిశగా చివరి ప్రయత్నమని తెలిపారు. సమ్మె చేస్తున్న జూడాలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలుండవని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యయుత ఆందోళనను అణిచివేయడానికి ఇది ఉత్తరప్రదేశ్ కాదు, బెంగాల్ అని సీఎం వ్యాఖ్యానించారు. -
Junior doctors: ప్రత్యక్షప్రసారం చేయాలి
కోల్‌కతా: నెలరోజులకు పై గా విధులను బహిష్కరిస్తున్న జూనియర్ డాక్టర్లతో చర్చలకు పశి్చమబెంగాల్ ప్రభుత్వం వరుసగా రెండోరోజు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి సమక్షంలోనే చర్చలు జ రగాలని జూనియర్ డాక్టర్లు పట్టుబట్టారు. అలాగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని, తమ తరఫున 30 మంది ప్రతినిధుల బృందాన్ని చర్చలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. సచివాలయం నబన్నాలో బుధవారం సాయంత్రం 6 గంటలకు చర్చలకు రావాలని బెంగాల్ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ జూనియర్ డాక్టర్లకు ఈ–మెయిల్ ద్వారా ఆహా్వనాన్ని పంపారు. 12 నుంచి 15 మంది రావాలని కోరారు. సీఎం మమతా బెనర్జీ నేరుగా చర్చల్లో పాల్గొనే విషయాన్ని సీఎస్ మెయిల్లో ధృవీకరించలేదు. చట్టానికి బద్ధులై ఉండే పౌరులుగా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడం ప్రతి ఒక్కరి విధి అయినప్పటికీ జూనియర్ డాక్టర్లు దానికి కట్టుబడలేదని పంత్ పేర్కొన్నారు. దీనిపై సాయంత్రం 5:23 గంటలకు జూనియర్ డాక్టర్లు విలేకరుల సమావేశంలో స్పందించారు. ‘సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే చర్చలు జరగాలి. టీవీల్లో ప్రత్యక్షప్రసారం ఉండాలి. పలు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులకు చెందిన జూనియర్ డాక్టర్లు ఆందోళనలో పాలుపంచుకొంటున్నందున కనీసం 30 మందిని చర్చలకు అనుమతించాలి’ అని జుడాల ఫోరం ప్రకటించింది. షరతులకు ఒప్పుకోం బేషరతుగా చర్చలకు రావాలని, జూనియర్ డాక్టర్లు పెట్టిన ఏ షరతునూ అంగీకరించాడానికి బెంగాల్ సర్కారు సిద్ధంగా లేదని ఆరోగ్యమంత్రి చంద్రిమా భట్టాచార్య స్పష్టం చేశారు. షరతులు పెట్టారంటే వారు మనస్ఫూర్తిగా చర్చలకు సిద్ధంగా లేరని అర్థమన్నారు. -
రాజ్‌భవన్‌లో నాకు భద్రత లేదు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ విభేదాలు మరోసారి తెరమీదకొచ్చాయి. గవర్నర్ అధికార నివాసం రాజ్‌భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్న బెంగాల్ పోలీసు బృందంతో మనకు ముప్పు ఉందని గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లో డ్యూటీలో ఉన్న పోలీసులంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆదేశించిన కొద్దిరోజులకే ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘‘ ప్రస్తుత ఆఫీసర్–ఇన్చార్జ్, ఆయన బృందం వల్ల నా వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియజేశా. అయినా ఆమె ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చుట్టూ ఉన్న కోల్‌కతా పోలీసులతో నాలో అభద్రతా భావం గూడుకట్టుకుపోయింది’’ అని గవర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఇక్కడి పోలీసులు ప్రవర్తిస్తున్నారు. రాజ్‌భవన్‌కు వ్యతిరేకంగా వాళ్లు పనిచేస్తున్నట్లు నా వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న పోలీసులు గతంలో రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’లో పనిచేశారు. ఒకరి కోసం వీళ్లు పనిచేస్తున్నారు. వాళ్ల పేరు నేను చెప్పదల్చుకోలేదు’’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. -
సౌరవ్ గంగూలీకి భద్రత పెంపు
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి భద్రత పెంచాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. గంగూలీకి ప్రస్తుతమున్న 'వై' కేటగిరీ భద్రత పదవీకాలం మే 16తో ముగియడంతో మమతా సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాదా భద్రతను 'వై' నుంచి 'జెడ్' కేటగిరీకి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు మమతా సర్కార్ నిన్న అధికారికంగా వెల్లడించింది. వై కేటగిరీ భద్రత ప్రకారం గంగూలీ నివాసం వద్ద ముగ్గురు స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులు, ముగ్గురు లా ఎన్‌ఫోర్సర్స్ (చట్టాన్ని అమలు చేసేవారు) ఉండేవారు. జెడ్ కేటగిరీ భద్రత ప్రకారం ఇకపై గంగూలీ భద్రత దళం సంఖ్య ఎనిమిది నుండి పది మంది పోలీసు అధికారులతో (24 గంటల పాలు) కూడినది ఉండనుంది. గంగూలీ ప్రస్తుతం ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, గంగూలీ సేవలందిస్తున్న ఢిల్లీ జట్టు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శనను కనబరుస్తూ అధికారికంగా లీగ్ నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇంకా 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతని స్థానంలో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా నియమించారు. వార్నర్ వ్యక్తిగతంగా రాణించినా.. మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో డీసీకి ఈ గతి పట్టింది. చదవండి: నీకు బౌన్సర్లు వేయడం మాత్రమే వచ్చా? నాపై రాహుల్ సీరియస్ అయ్యాడు: సిరాజ్ -
సింగర్ కేకే మృతిపై వివాదం
కోల్‌కతా: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కేకే అకాల మర ణంపై రాజకీయ రగడ జరుగుతోంది. మంగళవారం రాత్రి కోల్‌కతాలో ప్రదర్శన అనంతరం హోటల్ చేరుకుంటూనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలడం తెలిసిందే. ప్రదర్శనకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడమే ఇందుకు కారణమని బీజేపీ ఆరోపించింది. దీనిపై లోతుగా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేసింది. ‘‘మూడు వేల మంది పట్టే ఆడిటోరియంలో రెట్టింపుకు పైగా జనం వచ్చారు. కేకేను పూర్తిగా చుట్టుముట్టారు’’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య ఆరోపించారు. అనవసరంగా రాబందు రాజకీయాలు చేయొద్దంటూ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వీటిని తిప్పికొట్టింది. కేకే మృతికి గుండెపోటే కారణమని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్టు పోలీసులు చెప్పారు. దర్యాప్తు జరుగుతోందన్నారు. ‘‘మంగళవారం రాత్రి ప్రదర్శన తర్వాత హోటల్ లాబీల్లో ఆయనను అభిమానులు భారీగా చుట్టుముట్టారు. ఒకరిద్దరితో సెల్ఫీ దిగాక పై అంతస్తులోని తన గదిలోకి వెళ్లబోతూ తూలి పడిపోయారు’’ అని వివరించారు. ఆయన నుదిటిపై, పెదవులపై రెండు గాయాలున్నాయన్నారు. సీఎం మమతా బెనర్జీ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. గొప్ప గాయకున్ని కోల్పోయామన్నారు. భార్య, ఇతర కుటుంబీకులను ఓదార్చారు. కేకే అంత్యక్రియలు ముంబైలో జరగనున్నాయి. -
బెంగాల్లో హింసపై హైకోర్టు సీరియస్
కోల్‌కతా: రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల అనంతర హింసాబాధితులు చేసే ఫిర్యాదులను తీసుకొని కేసులు నమోదు చేయాలని కలకత్తా హైకోర్టు ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. వీరందరికీ తగిన వైద్య సదుపాయం అందించాలని, రేషన్ సరుకులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని సైతం ఆదేశించింది. తదుపరి న్యాయ విచారణ కోసం సంబంధిత డాక్యుమెంట్లన్నింటినీ కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరికృష్ణ ద్వివేదిని కోరింది. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింస చెలరేగినట్లు కనిపిస్తోందని, అయితే ప్రభుత్వం మాత్రం ఈ నిజాన్ని నిరాకరిస్తోందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ హింసలో పలువురు చనిపోయారని, పలువురిపై లైంగిక దాడులు జరిగాయని, మైనర్ బాలికలను కూడా వదిలినట్లు కనిపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలామంది ఇళ్లూ వాకిళ్లు వదిలిపోవాల్సివచ్చిందని, ఇప్పటివరకు ప్రభుత్వం బాధితుల్లో ధైర్యం, నమ్మకం కలిగించే పని చేయలేదని విమర్శించింది. చాలామంది బాధితుల ఫిర్యాదులను సైతం పోలీసులు తీసుకోలేదని, కొందరిపై ఎదురు కేసులు పెట్టారని వ్యాఖ్యానించింది. సుప్రీం నోటీసులు మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై దర్యాప్తుకు సిట్ నియమించాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి, ఈసీకి నోటీసులు జారీ చేసింది. కాగా కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని బీజేపీ నేత సువేందు అధికారి స్వాగతించారు. ఎన్నికల అనంతర హింసపై తమ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. పలువురు బీజేపీ నేతలు ఈ సందర్భంగా మమతపై విమర్శలు గుప్పించారు. బెంగాల్లో హింసపై జాతీయ మానవ హక్కుల సంఘంతో విచారింపజేయాలన్న సూచనను మార్చాలని బెంగాల్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు జూన్ 21న తోసిపుచ్చింది. బెంగాల్ పోలీసులు హింసను అడ్డుకోలేదన్న ఆరోపణల నిజానిజాలు తెలుసుకోవాలని రాష్ట్ర హోంశాఖ కోరింది. అయితే హింసారోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పనిచేస్తుందన్న నమ్మకం తమకు కలగట్లేదని, అందుకే జాతీయ మానవ హక్కుల సంఘ విచారణకు ఆదేశించామని కోర్టు తెలిపింది. మరోవైపు సువేందు అధికారికి కేంద్రం ఇచ్చే రక్షణతో పాటు తమ ప్రభుత్వం అదనపు రక్షణ ఏర్పాట్లు చేస్తుందని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. -
అమిత్ షా వర్సెస్ టీఎంసీ
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం అన్యాయమని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ మేరకు బెంగాల్ సీఎం మమతకు లేఖ రాశారు. ‘వేరే ప్రాంతాల్లో చిక్కుకున్న కూలీలను సొంతూళ్లకు తీసుకువచ్చేందుకు కేంద్రం రైళ్లను ఏర్పాటు చేసింది. కానీ, బెంగాల్ ప్రభుత్వం మాకు సహకరించడం లేదు. ఆ రైళ్లను రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. దీంతో కార్మికులు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై అధికార టీఎంసీ నేత, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అయిన అభిషేక్ బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ‘లాక్డౌన్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైన హోం మంత్రి.. బెంగాల్ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ఆయన.. చాలా వారాల మౌనం తర్వాత గొంతు విప్పారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే. షా తన ఆరోపణలను రుజువు చేయాలి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి’ అని ట్విట్టర్లో డిమాండ్ చేశారు. కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, తెలంగాణల్లో ఉన్న రాష్ట్రానికి చెందిన వలస కూలీల తరలింపునకు ఇప్పటికే 8 రైళ్లను ఏర్పాటు చేశామనీ, ఇందులో మొదటిది త్వరలోనే హైదరాబాద్ నుంచి మాల్దాకు చేరుకోనుందని తెలిపారు. రాష్ట్రంలోకి వలస కార్మికులను రానివ్వడంలేదంటూ ఆరోపిస్తున్న అమిత్ షా..మహారాష్ట్రలో 16 మంది కూలీల మరణానికి రైల్వే మంత్రిని బాధ్యుణ్ని చేస్తారా అని టీఎంసీ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ ప్రశ్నించారు. -
ఆశలు లాక్‘డౌన్’
సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచులను సమకూర్చడంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చేతులెత్తేసింది. జనపనారతో తయారుచేసే గోనె సంచుల మిల్లులను లాక్డౌన్ గడువుకు ముందే తిరిగి ఆరంభించడానికి నిరాకరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మన రాష్ట్రానికి నిరాశ మిగిల్చింది. దీంతో అప్రమత్తమైన పౌరసరఫరాల శాఖ రాష్ట్రంలోని రేషన్‌డీలర్లు, రైస్‌మిల్లర్ల వద్ద ఉన్న పాత గోనె సంచులను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని, ఒక్క గోనె సంచి కూడా బయటకు వెళ్లకుండా యుద్ధ ప్రాతిపదికన సేకరించాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్రాల వినతులకు బెంగాల్ ‘నో’ జనపనార బస్తాల కొరతతో రైతుల ఉత్పత్తుల సేకరణ దెబ్బతింటోందని, కాబట్టి సంచులు సమకూర్చాలని తెలంగాణ, పంజాబ్‌తో పాటు కేంద్ర ఆహారసంస్థ (ఎఫ్‌సీఐ) కొన్నిరోజులుగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని మోదీతో పాటు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతోనూ మాట్లాడారు. కేంద్ర జౌళి శాఖ సైతం మిల్లులు పనిచేయడానికి అనుమతించాలని ఆ ప్రభుత్వాన్ని కోరింది. పశ్చిమబెంగాల్లో 60 జనపనార మిల్లులు ఉండగా, అక్కడి నుంచే దేశానికి అవసరమైన 80శాతం సంచుల ఉత్పత్తి జరుగుతోంది. ఈ మిల్లుల్లో 2 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణ సీజన్ మొదలైంది. ప్రస్తుత సీజన్లో ఎఫ్‌సీఐ వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆహార ధాన్యాల నిల్వలను తరలించేందుకు భారీగా సంచులు అవసరం. ముఖ్యంగా రాష్ట్రాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద బియ్యం, గోధుమలు, కందిపప్పు సరఫరా చేయాలంటే కనీసం 20లక్షల బేళ్లు (సుమారు 100 కోట్ల సంచులు) ఈ ఏడాది అక్టోబర్ వరకు అవసరమని, ఈ దృష్ట్యా తయారీని ఆరంభించాలని ఈనెల 3న పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఎఫ్‌సీఐ లేఖ రాసింది. ఇక తెలంగాణలో గతేడాది 47లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణకు కొత్తగా 12కోట్ల సంచులు సమకూర్చుకుంది. ఈ ఏడాది కోటి టన్నుల మేర సేకరణ ఉండటంతో 20కోట్ల సంచులు అవసరమని గుర్తించింది. ఇప్పటికే ఒకసారి వినియోగించిన సంచులు కొంతమేర లభ్యతలో ఉన్నాయి. ఇవి 35 నుంచి 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సరిపోతాయి. కొత్తగా కనీసం 7 కోట్ల సంచులు అవసరమని పౌరసరఫరాల శాఖ అంచనా వేయగా, వీటిని అందించేలా ఉత్పత్తిని ఆరంభించి సరఫరా చేయాలని ప్రభుత్వం బెంగాల్‌ను కోరింది. మిల్లులు తెరిచేందుకు అవసరమైన అనుమతులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇస్తే తప్ప తెరిపించలేమని ఆ రాష్ట్ర సీఎస్ రాజీవ్ సిన్హా ప్రకటించారు. సంచుల సేకరణకు నిర్ణయం: బెంగాల్ ప్రభుత్వ ప్రకటనతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. దీనిపై మంగళవారం సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. సమస్యను అధిగమించేందుకు రైస్ మిల్లర్లు, డీలర్ల దగ్గర ఉన్న పాత సంచులను తక్షణమే ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలని, పాత సంచుల సరఫరాదారుల నుంచి సేకరణ మొదలుపెట్టాలని ఆదేశించారు. వీటి స్టోరేజీ సమస్య రాకుండా సంచులను కొనుగోలు కేంద్రాలకు అందుబాటులో ఉన్న గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేయాలన్నారు. ధాన్యం సేకరణకు రూ.25వేల కోట్లు సమకూర్చినందున రవాణా కాంట్రాక్టర్లు, సరఫరాదారులు, డీలర్లకు తక్షణమే చెల్లింపులు చేయాలన్నారు. డీలర్ల నుంచి తీసుకునే సంచులకు ఒక్కో సంచి ధర రూ.16 ఉండగా,దాన్ని రూ.18కి పెంచినట్లు వెల్లడించారు. ఏప్రిల్ నెల రేషన్‌కు సంబంధించి ఒక్కో లబ్ధిదారుడికి 12 కిలోల బియ్యం ఇవ్వడంతో డీలర్ల వద్ద దాదాపు 60లక్షల గోనె సంచులున్నాయని, వీటిని సేకరించాలని సూచించారు. సంచుల సేకరణ ప్రక్రియను అడిషనల్ కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. -
కోహితూర్.. నిజమైన రాజ ఫలం!
చారిత్రక ప్రసిద్ధి పొందిన కోహితూర్ మామిడి పండుకు ప్రాదేశిక గుర్తింపు పొందడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది అత్యంత మధురమైన ఫలరాజం. దీనికున్న మరో విశిష్టత ఏమిటంటే.. ప్రత్యేకించి రాజ కుటుంబీకులు మాత్రమే తినేవారట. దాదాపు రెండున్నర శతాబ్దాల క్రితం ఈస్టిండియా కంపెనీ భారత ఉపఖండంలో రాజకీయ పగ్గాలు చేపట్టడానికి ముందు పశ్చిమ బెంగాల్‌ను పాలించిన ముర్షీదాబాద్ చివరి నవాబు సిరాజ్–ఉద్–దాలా హయాం(క్రీ.శ.1733–1757)లో ఈ మామిడి వంగడం రూపుదాల్చింది. ఈ ఫలరాజాన్ని రాజ కుటుంబీకులు అమితంగా ఇష్టపడేవారట. చారిత్రక ప్రసిద్ధి పొందిన ఈ మధుర ఫలరాజం ఒక్కొక్కటి రూ.1,500 వరకు మార్కెట్లో ధర పలుకుతోందిప్పుడు. ఇది సున్నితమైన ఫలం కావడం వల్ల చెట్టు మీదనే మిగల పండిన తర్వాత చేతితోనే కోసి.. భద్రంగా దూదిలో ఉంచుతూ ఉంటారు. కోసిన తర్వాత సాధ్యమైనంత త్వరగా తినేయాల్సి ఉంటుంది. అతి సున్నితమైన పండు కావడంతో నిల్వ, రవాణాలో పరిమితుల దృష్ట్యా ఈ వంగడం వాణిజ్యపరంగా సాగుకు అనుకూలమైనది కాదని రైతులు భావిస్తున్నారు. అందువల్ల ఈ వంగడం అంతరించిపోయే స్థితిలో ఉంది. ముర్షీదాబాద్ జిల్లాలో 15 మంది రైతుల దగ్గర 25–30 కొహితూర్ మామిడి చెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయట. కొన్ని చెట్ల వయసు 150 ఏళ్లకు పైగానే ఉందట. ఒక్కో చెట్టు ఏడాదికి 40 పండ్ల కన్నా కాయదు. ఒక సంవత్సరం కాసిన చెట్టు రెండో ఏడాది కాయదు. ఈ నేపధ్యంలో కోహితూర్ మామిడి రకాన్ని పరిరక్షించడానికి ఉపక్రమించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రాదేశిక గుర్తింపు ఇవ్వవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల కోరింది. ముర్షీదాబాద్ నవాబు సిరాజ్–ఉద్–దౌలా మామిడి పండ్లంటే అమితంగా ఇష్టపడే వారట. దేశవ్యాప్తంగా అనేక రకాల మామిడి రకాలను సేకరించి పెంచేవారు. మేలైన మామిడి రకాలను సంకరపరచి మంచి రకాలను తయారు చేసేందుకు ప్రత్యేక నిపుణులను ఆయన నియమించారు. హకీమ్ అదల మొహమ్మది అనే మామిడి ప్రజనన అధికారి.. రాజు గారికి బాగా ఇష్టమైన కాలోపహర్ను, మరో రకాన్ని సంకరపరచి కొహితూర్ వంగడాన్ని రూపొందించారు. రైతుకు పండుకు రూ. 500 వరకు రాబడి ఉంటుంది కాబట్టి.. ప్రాదేశిక గుర్తింపు(జి.ఐ.) ఇస్తే దీని సాగుకు రైతులను ప్రోత్సహించడం సాధ్యపడుతుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రాదేశిక గుర్తింపు లభిస్తే.. సంబంధిత అధికారుల వద్ద ముందుగా రిజిస్టర్ చేయించుకున్న రైతులే ఈ వంగడాన్ని సాగు చేయగలుగుతారు, అమ్ముకోగలుగుతారు. పూర్వం రాజులు కోహితూర్ మామిడి పండ్లను తేనెలో ముంచి ఉంచడం ద్వారా కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచుకునే వారట! అంతేకాదు.. ఇనుప కత్తితో కోస్తే దీని రుచి పాడవుతుందట. వెదురు చాకులతో కోస్తేనే దీని రుచి బాగుంటుందని చెబుతుండటం విశేషం!! -
మరిన్ని నేతాజీ ఫైళ్లు బహిర్గతం
కోల్‌కతా: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్య ఘటనకు సంబంధించి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం మరిన్ని ఫైళ్లను బహిర్గతం చేసింది. సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ వివరాలను వెల్లడించారు. నేతాజీకి సంబంధించి 1937- 47 మధ్య జరిగిన బెంగాల్ రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లోని అంశాలను బహిర్గతం చేశారు. నేతాజీకి సంబంధించిన ఫైళ్లను కేంద్ర ప్రభుత్వం కూడా బహిర్గతం చేయాలని మమతా బెనర్జీ కోరారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇటీవల నేతాజీకి సంబంధించిన 64 పైళ్లను బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. కోల్ కతాలోని పోలీసు మ్యూజియంలో వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఫైళ్లతోపాటు కొన్ని డీవీడీలు కూడా బయటపెట్టిన ఆ రాష్ట్ర హోంశాఖ డీవీడీలను నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేసింది. ఈ ఫైళ్లలో మొత్తం 12,744 పేజీలు ఉన్నాయి. ఈ ఫైళ్ల ప్రకారం నేతాజీ 1948లో చైనాలో బతికున్నట్టు తెలుస్తోంది. చైనాలోని మంచూరియాలో ప్రాంతంలో ఉన్నట్టు వెల్లడైంది. కాగా 1945 ఆగస్టు 22న విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్టు టోక్యో రేడియో ప్రకటించింది. అయితే ఈ వార్తను బోస్ అనుచరులు ఖండించారు. అప్పటి నుంచి నేతాజీ మరణం, అదృశ్యం మిస్టరీగా మారింది.