
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడు స్ధానాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో భర్తీ చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక 2018 నుంచి ఢిల్లీ ప్రధాన కోచ్‌గా ఉన్న పాంటింగ్.. జట్టుకు ట్రోఫీని అందించడంలో విఫలమయ్యాడు.
అదే విధంగా ఈ ఏడాది సీజన్‌లో అయితే ఢిల్లీ మరి చెత్త ప్రదర్శన కనబరిచింది. 4 మ్యాచ్‌ల్లో కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. ఈ నేపధ్యంలోనే పాంటింగ్‌ను సాగనంపాలని ఢిల్లీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక గంగూలీ విషయానికి వస్తే.. దాదా ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్‌గా ఉన్నాడు. గంగూలీ 2019 ఐపీఎల్ ఎడిషన్‌లో మెంటార్‌గా ఢిల్లీ జట్టుతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2019, 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆప్స్ చేరడంలో గంగూలీ కీలక పాత్ర పోషించాడు. అప్పుడు ఢిల్లీ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. అయితే ఈ వార్తలపై ఢిల్లీ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
చదవండి: WTC Final: కొంచెం ఆలోచించండి.. కోచ్‌గా ద్రవిడ్ జీరో: పాకిస్తాన్ మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment