సౌరవ్ గంగూలీ (Photo Credit: iplt20.com)
IPL 2023 DC Vs KKR: ‘‘ఎట్టకేలకు అనుకున్న ఫలితం రాబట్టినందుకు సంతోషంగా ఉన్నాం. డగౌట్‌లో కూర్చుని మ్యాచ్ చూస్తున్నపుడు.. 25 ఏళ్ల క్రితం ఆడిన టెస్టు మ్యాచ్‌లో మొదటిసారి పరుగు పూర్తి చేసినపుడు కలిగిన అనుభూతిని పొందాను. ఈనాటి మ్యాచ్ ఎలా సాగిందో మీరంతా చూశారు... ఈరోజు అదృష్టం మావైపు ఉందనే చెప్పాలి’’ అని టీమిండియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ ఉద్వేగంగా మాట్లాడాడు.
ఎట్టకేలకు ఢిల్లీ బోణీ
ఐపీఎల్-2023లో వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఢిల్లీ ఎట్టకేలకు గురువారం తొలి విజయం నమోదు చేసింది. సొంతమైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం గంగూలీ మాట్లాడుతూ.. బౌలర్ల అద్భుత ప్రదర్శన వల్లే విజయం సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశాడు.
కేకేఆర్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడం కలిసి వచ్చిందని.. అయితే.. తమ బ్యాటింగ్ విభాగం మరింత మెరుగుపడాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. ‘‘ఈ సీజన్‌లో ఆరంభం నుంచే మా బౌలింగ్ బాగుంది. బెంగళూరు మ్యాచ్‌లో ఆర్సీబీని 170 పరుగులకే కట్టడి చేశాం. ముంబైతో మ్యాచ్‌లోనూ మా ప్రదర్శన బాగుంది.
మా బౌలర్లు అద్భుతం.. కానీ బ్యాటర్లే
ఆది నుంచే మా బౌలర్లు మెరుగ్గా రాణిస్తున్నారు. మా బ్యాటింగ్‌లోనే లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు రాబట్టగలం’’ అని గంగూలీ పేర్కొన్నాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో అన్రిచ్ నోర్జే అత్యద్భుతంగా ఆడాడని, ముకేశ్ కుమార్, ఇషాంత్ శర్మ కూడా తమ వంతు పాత్ర పోషించారని దాదా కొనియాడాడు.
వార్నర్ ఒక్కడే
కాగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. ఇషాంత్ శర్మ 2, ముకేశ్ కమార్ ఒకటి, నోర్జే 2, అక్షర్ పటేల్ 2, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీశారు.
లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఓపెనర్ డేవిడ్ వార్నర్ అర్థ శతకంతో శుభారంభం అందించాడు. 57 పరుగులతో వార్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా వాళ్లలో మనీశ్ పాండే(21) కాస్త పర్వాలేదనిపించగా.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 128 పరుగులు సాధించిన ఢిల్లీ 4 వికెట్ల తేడాతో గెలుపొంది తొలి విజయం అందుకుంది.
చదవండి: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. చెన్నైకి గుడ్ న్యూస్! 16 కోట్ల ఆటగాడు రెడీ..
#Ishant Sharma: 717 రోజుల తర్వాత ఎంట్రీ.. అదరగొట్టాడు
Off the mark in #TATAIPL 2023 ✅@DelhiCapitals with a much-needed victory as they complete a 4-wicket win over #KKR at home 👏👏
— IndianPremierLeague (@IPL) April 20, 2023
Scorecard ▶️ https://t.co/CYENNIiaQp #TATAIPL | #DCvKKR pic.twitter.com/Ol7Mu3s9IT
Comments
Please login to add a commentAdd a comment