DC Vs KKR: Warner Surpasses Rohit Sharma To Become Highest Rungetter Against KKR - Sakshi
Sakshi News home page

IPL 2023 DC Vs KKR: చరిత్ర సృష్టించిన డేవిడ్‌ వార్నర్‌.. రోహిత్‌ శర్మ రికార్డు బద్దలు

Published Fri, Apr 21 2023 1:10 PM | Last Updated on Fri, Apr 21 2023 1:59 PM

Warner surpasses Rohit Sharma to become highest rungetter against KKR - Sakshi

PC:IPL.com

ఐపీఎల్‌-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి విజయం సాధించింది. అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. 128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

ఈ విజయంలో ఢిల్లీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 41 బంతులు ఎదుర్కొన్న వార్నర్‌ 11 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన వార్నర్‌.. ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. 

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డేవిడ్‌ భాయ్‌ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు కేకేఆర్‌పై 26 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 146 సగటుతో 1042 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(1040) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో రోహిత్‌ రికార్డును వార్నర్‌ బ్రేక్‌ చేశాడు. ఇక రోహిత్‌ తర్వాతి స్థానంలో 850 పరుగులతో శిఖర్‌ ధావన్‌ ఉన్నాడు.
చదవండి: IPL 2023: ఒకప్పుడు టీమిండియా కెప్టెన్‌.. ఇప్పుడు పోలీస్‌ ఆఫీసర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement