
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్‌కే మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ సమయంలో వార్నర్, జడేజా మధ్య జరిగిన ఫన్నీ సంఘటన నవ్వులు పూయించింది.
విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ దీపక్ చహర్ వేశాడు. ఓవర్ మూడో బంతిని వార్నర్ కవర్స్ దిశగా ఆడాడు. రిస్క్ ఉన్నప్పటికి సింగిల్ పూర్తి చేశాడు. అయితే మొయిన్ అలీ త్రో వేయగా రహానే దానిని అందుకున్నాడు. ఇక్కడ వార్నర్ మరో పరుగు తీయడానికి ప్రయత్నించాడు. అవతలి ఎండ్‌లో ఉన్న జడేజా బంతి తనకు వేయమంటూ సైగ్ చేశాడు.
దీంతో రహానే బంతిని జడ్డూవైపుకు విసిరాడు. అప్పటికే వార్నర్ క్రీజులోకి వెళ్లిపోయాడు. కానీ ఇక్కడే ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. బంతిని అందుకున్న జడ్డూ త్రో వేస్తానని బెదిరించడం.. వార్నర్ కూడా నాకేం భయం లేదు అన్నట్లుగా క్రీజు దాటాడు.. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు.
కాసేపటికి వార్నర్ జడ్డూ స్టైల్లో బ్యాట్‌ను కత్తిలా తిప్పడం.. జడ్డూ కూడా తగ్గేదేలా అంటూ పుష్ప స్టైల్‌ను అనుకరించడంతో నవ్వులు విరపూశాయి. వార్నర్, జడ్డూ చర్యను పిలిప్ సాల్ట్ సహా సీఎస్‌కే ఆటగాళ్లు బాగా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Butta Bomma ⚔️ Pushpa 😀pic.twitter.com/Ron09NWd1p
— Chennai Super Kings (@ChennaiIPL) May 20, 2023
చదవండి: అంతులేని అభిమానం.. ఒక్కడి కోసం బస్సును చుట్టుముట్టారు