
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో భారీ విజయాన్ని దక్కించుకుంది. 224 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులకే పరిమితం కావడంతో 17 పాయింట్లతో సీఎస్‌కే ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది.
ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని జడేజాపై సీరియస్ కావడం ఆసక్తి కలిగించింది. ఈ ఘటన సీఎస్‌కే ఆటగాళ్లు ఒకరినొకరు అభినందించుకున్న అనంతరం జరిగింది. డగౌట్‌వైపు వెళ్తున్న సమయంలో జడ్డూ దగ్గరికి వచ్చిన ధోని సీరియస్‌గా ఏదో అంశమై చర్చించాడు.
అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన జడేజా మొహం ఒక్కసారిగా మారిపోయింది. ధోని మాట్లాడుతూ జడ్డూ భుజాలపై చేతులు వేసి ఏదో తప్పు చేసినట్లుగా క్లాసు పీకాడు. ఈ సమయంలో జడేజా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత చేతుల తీసేసిన ధోని జడేజా చెప్పేది వినకుండా అక్కడినుంచి వెళ్లిపోయాడు.
ఇద్దరి మధ్య ఏ విషయంలో సీరియస్ చర్చ జరిగిందనేది అర్థం కాలేదు. అయితే మ్యాచ్‌లో జడేజా బ్యాటింగ్‌లో ఏడు బంతుల్లో 20 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికి బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 50 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బహుశా ఇదే విషయమై ధోని కూడా జడేజాను హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు తమకు నచ్చిన రీతిలో కామెంట్స్ చేశారు.
— The Game Changer (@TheGame_26) May 20, 2023
చదవండి: నిలకడకు నిలువుటద్దం.. ఆడిన 14 సీజన్లలో 12సార్లు ప్లేఆఫ్స్‌కు
Comments
Please login to add a commentAdd a comment