పశ్చిమ బెంగాల్‌లో సందేశ్‌ఖాలీ ఘటన వెలుగు చూసినప్పటి నుంచి మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఉద్యమించాయి. అయితే రాష్ట్రంలోని శాంతియుత వాతావరణాన్ని బీజేపీ చెడగొట్టిందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పుడు బెంగాల్ రాజకీయాలన్నీ సందేశ్‌ఖాలీ చుట్టూ తిరుగుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ బీజేపీ సీనియర్ నేత శుభేందు అధికారి మరోసారి బెంగాల్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు. మమతా బెనర్జీ ఇప్పుడు అక్క(దీదీ) కాదని, గయ్యాళి అత్తగా మారిపోయారని ఆరోపించారు. ఇకపై మమతా బెనర్జీని ‘దీదీ’ అని పిలవడం మానేయాలని అన్నారు. ఇది అత్త, మేనల్లుడి ప్రభుత్వమని ఆరోపించారు. దీదీ అనే పేరులో మానవత్వం స్ఫురిస్తుందని, అయితే మమతా బెనర్జీలో క్రూరత్వం ప్రతిబింబిస్తోందని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఆమెను ఓడించానని, అందుకే తనపై 42 కేసులు పెట్టారని శుభేందు అధికారి ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణ జిల్లాలో ఉన్న సందేశ్‌ఖాలీ గ్రామం నిరసనలకు సాక్షిగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన మహిళలు ఇటీవల టీఎంసీ నేత షాజహాన్ షేక్‌తో పాటు ఇతర నేతలు తమ భూములను స్వాధీనం చేసుకున్నారని, లైంగిక దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే ఈ ప్రాంతం నిరసనలకు నిలయంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment