కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని వర్ధమాన్ - దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి నాలుగో దశ పోలింగ్ సోమవారం ప్రారంభం కాగానే, ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి దిలీప్ ఘోష్.. టీఎంసీ గూండాలు పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వడం లేదని ఆరోపించారు.
నిన్న రాత్రి ప్రిసైడింగ్ అధికారితో సహా పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వడం లేదని, పరిస్థితి చక్కబడేలా.. ఓటింగ్ సజావుగా జరిగేలా చూడాలని దిలీప్ ఘోష్ అన్నారు. ప్రతి బూత్ దగ్గర పోలీస్ బలగాలు ఉన్నప్పటికీ టీఎంసీ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు.
వర్ధమాన్-దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన కీర్తి ఆజాద్, సీపీఐ(ఎం)కి చెందిన సుకృతి ఘోషల్ పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఈరోజు ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.
2014 లోక్‌సభ ఎన్నికలలో, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ 34 స్థానాల్లో గెలిచింది. అయితే అప్పుడు బీజేపీ కేవలం 2 సీట్లను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. సీపీఐ(ఎం) 2, కాంగ్రెస్ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ సారి బీజేపీ మరిన్ని స్థానాల్లో గెలుపొందటానికి ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment