సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!
ఇమ్రాన్ డకౌట్
ఆహార హక్కు మనిషి ప్రాథమిక హక్కు. ఇందులో రాజకీయాలకు తావు లేదు. పాకిస్తాన్‌లో ఆహార అభద్రత ఈ మూడేళ్లలో రెట్టింపయింది. దేశం ఆకలితో అలమటిస్తోంది. ప్రమాద ఘంటికలు చెవులకు వినబడటం లేదా? ఇదేమీ యుద్ధంతో చితికిపోయిన దేశం కాదు. ఇలా ఉండటానికి ఏ హేతువూ లేదు. విఫల, అవినీతి మయ, అసమర్థ ప్రభుత్వమే దీనికి కారణం.
– భక్తవార్ భుట్టో జర్దారీ, ‘బేనజీర్ భుట్టో’ కూతురు
మీ వైఖరేమిటి?
సినీ నటుడు నసీరుద్దీన్ షా ఇండియాను విమర్శించినప్పుడు ఉదారవాదులు స్వాగతించారు. అదే నసీరుద్దీన్ షా తాలిబన్‌ను విమర్శిస్తే మాత్రం ఉదారవాదులు కోపంగా ఉన్నారు. ఊహించండి ఇదెలా ఉందో!
– అభిషేక్ బెనర్జీ, మ్యాథెమెటీషియన్
నాయకుడి పనితనం
నాయకత్వమూ, పనితనము విషయంలో గందరగోళపడొద్దు. రెండూ వేర్వేరు అంశాలు. నువ్వు గొప్ప పనితనం చూపవచ్చు, కానీ గొప్ప నాయకుడివి కాకపోవచ్చు.
– రిషాద్ ప్రేమ్‌జీ, పారిశ్రామికవేత్త
ఇదా కారణం?
చాలామంది పండితులు చెప్పేదేమంటే– అఫ్గాన్ ఇస్లామిస్టులకు పాకిస్తాన్ మద్దతి వ్వడానికి ప్రధాన కారణం, పష్తూన్లు పాకి స్తాన్ అనే భావనను అంగీకరించరన్న భయం, ఇప్పటి సరిహద్దులను గౌరవించరన్న ఆందోళన.
– సదానంద్ ధూమే, కాలమిస్ట్
మాట్లాడితే గొప్పా?
ఇది నేను ప్రైవేటు రంగం లోనూ, ప్రభుత్వ రంగంలోనూ గమనించాను. బాగా ప్రెజెంటే షన్లు ఇవ్వగలిగి, ఇంగ్లిష్‌లో ధారాళంగా మాట్లాడగలిగేవారు నిజంగా కష్టపడి పనిచేసే మనుషులను కమ్మేస్తారు. కానీ నిజమైన బాస్‌కు ఎవరు ఎంత పనిమంతులో కచ్చితంగా తెలుస్తుంది. అయితే అలా పసిగట్టగలిగే స్పృహ మాత్రం ఒక అరుదైన గుణమే.
– ప్రభ్‌జ్యోత్ సింగ్, ఇస్రో మాజీ సైంటిస్ట్
లెక్క చెప్పగలవా!
ఈమధ్య ఎందుకో ఇది నా మనసులో కొచ్చింది. కానీ దీని కోసం ప్రభుత్వ వెబ్ సైట్లలో వెతకడానికి చేసిన ప్రయత్నం నిష్ఫలం అయింది. ఎక్కడా ఒక స్థిరమైన సమాధానం దొరకలేదు. అందుకే నేరుగా మిమ్మల్నే అడుగుతున్నా: ప్రస్తుతం ఇండియాలో ఎన్ని జిల్లాలున్నాయి?
– గౌతమ్ మీనన్, ప్రొఫెసర్
మెరుగైన చరిత్ర
గత కొన్ని వారాలుగా టీకా కార్య క్రమం బ్రహ్మాండంగా కొనసాగుతోంది. మొత్తంగా మన ప్రజారోగ్య రంగ కష్టాల్లో చూస్తే, టీకాల విషయంలో మాత్రం మనం మెరుగ్గా ఉన్నాం. ముఖ్యంగా ఉక్రెయిన్‌కు చెందిన వాల్దెమార్ హాఫ్‌కిన్ ఇండియా వచ్చినప్పటినుంచి. (ఆయన కలరా టీకాను ఇండియాలో విజయవంతం చేశాడు). ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్లలో పుణేలోని హాఫ్‌కిన్ ఇన్‌స్టిట్యూట్ ఉన్నచోటే ఇప్పుడు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉన్నది.
– చిన్మయ్ తుంబే, చరిత్రకారుడు
Comments
Please login to add a commentAdd a comment