సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!
ఇదే గోలా?
పొద్దున లేస్తూనే నేను వింటున్న వార్తలు (పెరుగు తున్న ద్రవ్యోల్బణం మినహా యించి) అన్నీ కూడా ఆలయాలు, మసీదుల గురించే. ఇది 2022. అయినా మనం ఇంకా రోజంతా– హిందువులు, ముస్లింలు; గుడులు, మసీదులు ఇవే మాట్లాడుకుంటున్నాం. ఇది ఆందోళనకరం, భయానకం. చెప్పాలంటే శక్తిని నిర్వీర్యం చేస్తోంది.
– నేహా ఖన్నా, యాంకర్
నిషేధాల మీద నిషేధాలు
తాలిబన్ కొత్త ఉత్తర్వు ప్రకారం– పురుషులు, మహిళలు కలిసి రెస్టారెంట్లో తినడం నిషిద్ధం. పార్కులకు కలిసి వెళ్లడానికి కూడా అనుమతి లేదు, వాళ్లు పెళ్లయిన దంపతులే అయినా సరే. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మహిళా హక్కుల సంక్షోభాన్ని అఫ్గానిస్తాన్ ఎదుర్కుంటోంది.
– షబ్నమ్ నసీమీ, బ్రిటన్ ప్రభుత్వ సలహాదారు, ఒకప్పటి అఫ్గాన్ శరణార్థి
ఆటవిక చర్య
కశ్మీరీ పండిత్ అయినందుకు రాహుల్ భట్‌ను తీవ్రవాదులు చంపేశారు. కశ్మీరీ పోలీస్ అయినందుకు రియాజ్ ఠోకర్‌ను తీవ్ర వాదులు చంపేశారు. అసహనం, ఆటవికత, అగాథపు చీకట్లలాంటి దుష్టత్వమే జీవితంగా గడిపే తీవ్రవాదులు మరో రెండు కశ్మీరీ ప్రాణాలను అంతమొందించాయి.
– జునైద్ అజీమ్ మట్టూ, శ్రీనగర్ మేయర్
పాత రోజులు కావు
మా నాన్నతో మాట్లాడుతున్నాను. ఒక జ్ఞాపకం పంచుకున్నారు. 1960, 70ల ప్రాంతంలో ఆగ్రాలోని హిందూ బట్టల దుకాణదారులు రోడ్ల మీద తమ తాన్లను పరిచేవారట; ముఖ్యంగా జుమా అల్‌విదా, రంజాన్ రోజుల్లో ముస్లింలు సామూహిక ప్రార్థన చేసేటప్పుడు. వాటి మీద నమాజ్ చేయడం వల్ల బట్టలకు ఆశీర్వాదం దొరికి అమ్మకాలు పెరుగుతాయనీ, ‘బర్కత్’ అవుతుందనీ నమ్మేవాళ్లట. ‘ఆలోచనే మారిపోయిందిప్పుడు,’ అన్నారు.
– ఘజాలా వాహబ్, సంపాదకురాలు
ట్రంపును తప్పించారంతే...
జో బైడెన్ తప్పు ఏమిటంటే, దేశాన్ని మార్చడానికి ఆయనను ఎన్నికల్లో గెలిపించారని అనుకుంటున్నారు. కానీ నిజానికి అందరూ కోరుకున్నది కొద్దిగా నాటకీయత తగ్గాలని!
– ఎలాన్ మస్క్, వ్యాపారవేత్త
భరించలేని వైరస్
కోవిడ్–19 పాజిటివ్ అని తేలింది. తల నుంచి కాళ్ల వరకు విపరీతమైన నొప్పి. ఏదో ఒక పెద్ద లారీ ఢీకొట్టినట్టు అనిపిస్తోంది. నిజంగా నాకు బాలేదు. నాకోసం ప్రార్థించండి.
– రెనీ లిన్, అమెరికా యాక్టివిస్ట్
నిరసనే లేదు
వంట గ్యాసుకు నేను 1,048 రూపా యలు కడుతున్నాను. మీరెంత చెల్లిస్తు న్నారు? అది నాలుగు వందల రూపా యలు ఉన్న రోజులు నాకు తెలుసు– అప్పుడు దానిమీద చాలా నిరసన వ్యక్తమైంది.
– బబీతా శర్మ, అస్సాం కాంగ్రెస్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment