పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని ఏ ప్రాంతాన్నీ విడిచిపెట్టకుండా ప్రధాని మోదీ ఈ ఏడాది ఏకంగా 22 ర్యాలీలు నిర్వహించారు. ఇంతకు ముందు పశ్చిమ బెంగాల్‌లో ఏ ప్రధాని కూడా ఇన్ని ర్యాలీలు చేపట్టలేదు.
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రధాని మోదీ తాను చేపట్టే ర్యాలీలతో పశ్చిమ బెంగాల్‌లోని ప్రతీ ప్రాంతాన్నీ కవర్‌చేసే ప్రయత్నం చేశారు. ఈసారి పెద్దఎత్తున కాంగ్రెస్ నేతలెవరూ ఇక్కడ ర్యాలీలు చేపట్టకపోవడం విశేషం. మార్చి 16న ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం ప్రధాని మోదీ బెంగాల్‌లో భారీ ర్యాలీలు నిర్వహించారు. నేడు (బుధవారం) నిర్వహించే రెండు ర్యాలీలతో మోదీ పశ్చిమ బెంగాల్‌లో ఈ ఏడాది మొత్తం 22 ర్యాలీలు నిర్వహించినట్లవుతుంది.
2021 అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజేపీ బెంగాల్‌పై దృష్టి సారించింది. రాష్ట్రంలోని అవినీతి, బంగ్లాదేశ్ నుండి చొరబాట్లు తదితర అంశాలతో ప్రధాని మోదీ అధికార తృణమూల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో సీఏఏపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. సందేశ్‌ఖాలీలోని మహిళల అణచివేతపై దుమ్మెత్తిపోశారు. సందేశ్‌ఖాలీ ప్రాంతంలోని మహిళలకు న్యాయం చేసే విధంగా ఆ ప్రాంతానికి చెందిన రేఖా పాత్రకు టికెట్ ఇచ్చారు. ఈ విధంగా ప్రధాని మోదీ మహిళలకు బీజేపీ అండగా ఉంటుందనే సందేశాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment