
మమత, నరేంద్ర, షఫీ, ప్రియ ముఖ్య తారలుగా గౌతమ్. ఎమ్ రూపొందిస్తున్న మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం ‘సిరిమల్లె పువ్వా’. ఎస్.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై కౌసర్ జహాన్ నిర్మిస్తున్నారు. తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ చేతుల మీదగా ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక మెసేజ్ ఉన్న వెరైటీ చిత్రం. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. టైటిల్‌కు తగ్గట్టుగానే సిరిమల్లె పువ్వంత స్వచ్ఛంగా ఉంటుంది’’ అన్నారు.
‘‘గౌతమ్‌గారు చెప్పిన కథ ఎంతో నచ్చింది. మెసేజ్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి’’ అన్నారు కౌసర్ జహాన్. తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షులు డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహనరావు, సు«ధాకర్ గోగికర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు కెమెరా: సూర్య, ప్రభాకర్, ఫిరోజ్, సంగీతం: రామ్ మోహన్.
Comments
Please login to add a commentAdd a comment