'దేశాలు తిరిగితే దేశాన్నెవరు చూస్తారు' | Most of the Time Modi Is Abroad, Who Will Look After India, Wonders Mamata | Sakshi
Sakshi News home page

'దేశాలు తిరిగితే దేశాన్నెవరు చూస్తారు'

Published Tue, Apr 14 2015 12:57 PM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

'దేశాలు తిరిగితే దేశాన్నెవరు చూస్తారు' - Sakshi

'దేశాలు తిరిగితే దేశాన్నెవరు చూస్తారు'

కోల్కతా: విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ పై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చేరిగారు. 'అచ్చే సర్కార్' అంటూ ఊదరగొడుతన్న మోదీ పాలనలో...9 నెలలు 11 విదేశీ పర్యటనలు మాత్రం కనబడుతున్నాయన్నారు. ఆయన విదేశీ పర్యటనలతో నాకేమీ ఇబ్బందిలేదు కానీ ఎక్కువ సమయం విదేశాల్లోనే ఉంటే దేశాన్ని ఎవరు చూడాలని మమత మండిపడ్డారు.

అవాస్తవాలు చెప్పుతూ భూసేకరణ బిల్లుతో దేశాన్ని తప్పుదొవ పట్టిస్తున్నారన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రధానమంత్రి కనుసన్నల్లో నడుస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. సీబీఐ ప్రధానమంత్రి విభాగం(పీఎం డిపార్ట్ మెంట్)గా మారిందని విమర్శించారు. ప్రధాని ఆదేశాల మేరకే సీబీఐ నడుస్తోందని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement