2024 లోక్‌సభ ఎన్నికల ఏడు దశల ఓటింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అయితే అందరి చూపు జూన్ 4న వెలువడనున్న తుది ఫలితాలపైనే ఉంది. ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్ సర్వే ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఆధిక్యంలో నిలవనుంది. బీజేపీకి 22-26 సీట్లు వస్తాయని తేలింది. టీఎంసీ 14-18 సీట్లు దక్కించుకునే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ 1-2 సీట్లతో సరిపెట్టుకునేలా కనిపిస్తోంది. పశ్చి బెంగాల్‌లో బీజేపీ ఆధిక్యతకు కారణాలివేనంటూ పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో హిందూ ఓటర్లు మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారట. దీనికి రుజువుగా సోషల్ మీడియాలో పలు వీడియోలు కనిపిస్తాయి. మమత ప్రభుత్వం ఒక వర్గానికి చెందినవారిని ప్రోత్సహిస్తూ, హిందువులను అణచివేస్తున్నదనే ఆరోపణలున్నాయి.
సందేశ్‌ఖాలీ బసిర్‌హత్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్‌ను కార్నర్ చేసింది. నిందితుడు షాజహాన్ షేక్‌కు టీఎంసీతో సంబంధం ఉందని, అందుకే అతని అరెస్టులో జాప్యంపై జాప్యం చేసిందని బీజేపీ దుమ్మెత్తిపోసింది.
బెంగాల్‌లో ఎన్నికలు జరిగినప్పుడల్లా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయి. దీనిని రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. రామ నవమి సందర్భంగా ఊరేగింపుపై రాళ్లు రువ్వడం విషయంలో మమత ప్రభుత్వం మౌనం వహించడాన్ని పలువురు తప్పుబట్టారు. మమతా బెనర్జీపై ప్రజల్లో ఆగ్రహం పెరగడానికి ఇదే ప్రధాన కారణమంటారు.
ఈ ఏడాది బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామమందిరంతో బీజేపీకి ప్రత్యక్ష సంబంధం ఉండటంతో బెంగాల్‌లో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పలు ర్యాలీలు నిర్వహించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓటమి తరువాత, ఆపార్టీ బెంగాల్‌లో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. దాని ఫలితంగా ఈ రోజు బీజేపీ బెంగాల్‌లో ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.
బెంగాల్‌లో అవినీతి, ఉపాధి లేకపోవడం, ఫ్యాక్టరీల మూసివేత, శాంతిభద్రతల సమస్యలు సర్వసాధారణంగా మారాయి. అటువంటి పరిస్థితిలో ప్రజల్లో అధికార ప్రభుత్వంపై ఆగ్రహం ఏర్పడింది. ఇది కూడా బీజేపీకి ఓట్లు పడేలా చేసిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment