
ఫోన్ మాట్లాడుతూ భవనంపై నుంచి పడి యువతి మృతి
చైతన్యపురి: అపార్ట్‌మెంట్ టెర్రస్‌పై ఫోన్‌లో మాట్లాడుతున్న ఓ యువతి ప్రమాదవశాత్తు నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన సరూర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాక గ్రామానికి చెందిన ఏదుల కుమార్ బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం నగరానికి వచ్చి సరూర్‌నగర్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు.
కుమార్‌కు నలుగురు కూతుళ్లు. నాల్గో కూతురు మమత (18) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. మమత గురువారం అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులో టెర్రస్‌పై ఫోన్‌లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు కిందపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.