
మీడియాతో మాట్లాడుతున్న మమతా బెనర్జీ. బుర్ద్వాన్‌లో టోల్‌ప్లాజా వద్ద మొహరించిన సైనికులు
• మిలటరీ తిరుగుబాటు చేద్దామనుకుంటున్నారా?
• కేంద్రాన్ని ప్రశ్నించిన మమత.. గురువారం రాత్రంతా సెక్రటేరియట్‌లోనే నిరసన
• పార్లమెంటులోనూ విపక్షాల ఆందోళన
• మమత వ్యాఖ్యలు రాజకీయ నైరాశ్యంతో కూడుకున్నవి: పరీకర్
కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లోని టోల్ ప్లాజాల వద్ద ఆర్మీ మోహరింపు రాజకీయ దుమారం రేపుతోంది. రాష్ట్రానికి ఏమాత్రం సమాచారం లేకుండా కేంద్ర బలగాలను ఎలా పంపింస్తారంటూ కేంద్రంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ సర్కారు తీరుకు నిరసనగా.. గురువారం రాత్రంతా కోల్‌కతాలోని సెక్రటేరియట్‌లోనే ఉన్నారు. ఈ అంశంపై విపక్షాలు పార్లమెంటులో ఆందోళన వ్యక్తం చేశారుు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సభాకార్యక్రమాలను స్తంభింపజేశారుు. అరుుతే మమత రాజకీయ నైరాశ్యం కారణంగానే ఇలా మాట్లాడుతున్నారని కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. ఇందులో కుట్ర కోణమేదీ లేదని.. రోటీన్ నాకాబందీయేనని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ తెలిపారు.
మోదీ సర్కారు కుట్ర పన్నింది: మమత
పశ్చిమబెంగాల్‌లో ఆర్మీ మోహరింపు విషయంలో పార్లమెంటులో కేంద్రం ప్రకటన కుట్ర పూరితంగా ఉందని మమత బెనర్జీ ఆరోపించారు. బల ప్రదర్శన ద్వారా అనిశ్చితి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చామన్న కేంద్రం ప్రకటన అత్యవసరమని శుక్రవారం ఖండించారు. అంతకుముందు గురువారం రాత్రి కోల్‌కతా సెక్రటేరియట్‌లో మమత మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మిలటరీ తిరుగుబాటు చేద్దామనుకుంటున్నారా? మా ప్రభుత్వానికి తెలియకుండానే ఇక్కడ సైన్యాన్ని ఎలా మోహరిస్తారు?
నేను ఇక్కడే ఉంటాను’అని హెచ్చరించారు. రాష్ట్రంలో మోహరించిన బలగాలను వెంటనే కేంద్రం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్లమెంటులో తృణమూల్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వీరికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మద్దతు పలికింది. కాగా, శుక్రవారం సాయంత్రం మమత 36 గంటల నిరసన విరమించి సచివాలయం నుంచి బయటకు వచ్చారు.
అనవసర రాద్ధాంతం: పరీకర్
ఆర్మీ మోహరింపుపై పార్లమెంటులో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల ప్రతి ఏడాదీ ఇలాంటి నాకాబందీలు నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగానే పశ్చిమబెంగాల్‌లో టోల్ ప్లాజాల వద్ద సాయుధ బలగాలను మోహరించినట్లు లోక్‌సభలో వెల్లడించారు. గత నెలలో ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్‌ల్లోనూ టోల్ ప్లాజాల వద్ద భారీ వాహనాల వివరాలు సేకరించామన్నారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 28-30 తేదీల్లోనే ఆర్మీ పశ్చిమబెంగాల్‌లో సోదాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ భారత్ బంద్ పిలుపు కారణంగా డిసెంబర్ 1-2 తేదీలకు వారుుదా వేసినట్లు తెలిపారు.
ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నందున కోల్‌కతా పోలీసుల సహకారంతోనే సోదాలు చేస్తున్నామన్నారు. ఆర్మీని అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని పరీకర్ అన్నారు. ఆర్మీ కూడా ఒక ప్రకటనలో మమత వ్యాఖ్యలను ఖండించింది. కోల్‌కతా పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. కాగా, ఒక రాష్ట్రంలో సోదాలు నిర్వహించే ముందు ఆర్మీ.. ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని నిబంధనలున్నాయని తృణమూల్ రాజ్యసభ పక్ష నేత డెరిక్ ఒబ్రెరుున్ తెలిపారు. తాజా ఘటనలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆర్మీని ఆహ్వానించినట్లుగాఉన్న లేఖలను కేంద్రం బహిరంగపరచాలని ఆయన డిమాండ్ చేశారు. తృణమూల్ ప్రభుత్వంపై మోదీ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.