
న్యూఢిల్లీ: బిజూ జనతాదళ్ రాజ్యసభ ఎంపీ మమతా మొహంతా బుధవారం ఎగువసభలో తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. మమత స్వదస్తూరీతో రాజీనామా లేఖను రాసి, తనను కలిసి అందజేశారని, నిబంధనల ప్రకారమే ఉండటంతో ఆమె రాజీనామాను తాను ఆమోదించానని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వెల్లడించారు. మమత బీజేపీలో చేరనున్నారని పారీ్టవర్గాలు వెల్లడించాయి.
మమత రాజీనామాతో రాజ్యసభలో బీజేడీ బలం ఎనిమిదికి పడిపోయింది. ఒడిశాలో అధికారంలోకి వచి్చన బీజేపీ ఆ స్థానాన్ని దక్కించుకోనుంది.