BJD MP
-
బీజేడీ ఎంపీ మొహంతా రాజీనామా
న్యూఢిల్లీ: బిజూ జనతాదళ్ రాజ్యసభ ఎంపీ మమతా మొహంతా బుధవారం ఎగువసభలో తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. మమత స్వదస్తూరీతో రాజీనామా లేఖను రాసి, తనను కలిసి అందజేశారని, నిబంధనల ప్రకారమే ఉండటంతో ఆమె రాజీనామాను తాను ఆమోదించానని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వెల్లడించారు. మమత బీజేపీలో చేరనున్నారని పారీ్టవర్గాలు వెల్లడించాయి. మమత రాజీనామాతో రాజ్యసభలో బీజేడీ బలం ఎనిమిదికి పడిపోయింది. ఒడిశాలో అధికారంలోకి వచి్చన బీజేపీ ఆ స్థానాన్ని దక్కించుకోనుంది. -
ఒడిశాలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ..
భువనేశ్వర్: ఒడిశాలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. నబరంగ్ పూర్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్ మజీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. కాగా, ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన అవకాశాలకు.. ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల పట్ల కొంత అసహనంతో ఉన్నారని అన్నారు. ప్రజలకు మరింత సేవ చేయడానికి తాను పార్టీని విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రదీప్ మజీ.. 2009లో నబరంగ్‌పూర్ లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2014, 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఒడిశా యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రదీప్ మజీ రాజీనామాపై జేపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బహినిపాటి మాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా ప్రదీప్ మజీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారు బయటకు వెళ్లిపోవడం పార్టీకి మంచిదన్నారు. కాగా, లక్ష్మిపూర్ మాజీ ఎమ్మెల్యే కైలాష్ కులేశికా కాంగ్రెస్ పార్టీకి గత బుధవారం రాజీనామా చేసి బీజీడీలో చేరారు. ఈ క్రమంలో ప్రస్తుతం .. ప్రదీప్ మజీ కూడా పార్టీని వీడటం ప్రాధాన్యత సంతరించుకుంది. మజ్హి కూడా అధికార బీజేడీలో చేరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: ‘అక్టోబర్ 21 దేశ చరిత్రలో ఓ మైలురాయి’ -
బీజేడీ ఎంపీకి సుప్రీం బెయిల్
భువనేశ్వర్: అధికార పక్షం బిజూ జనతా దళ్ అభ్యర్థి, మయూర్భంజ్ లోక్‌సభ సిటింగ్ సభ్యుడు రామచంద్ర హంసదాకు సుప్రీంకో ర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం సుప్రీం కోర్టు నిర్వహించిన విచారణలో ఆయనకు ఈ బెయిల్ లభించింది. 4 ఏళ్లుగా ఆయన స్థానిక ఝరపడా జైలులో ఖైదీగా కొనసాగుతున్నారు. చిట్‌ఫండ్ మోసాల కేసులో సీబీఐ దర్యాప్తు బృందం ఆయనను అరెస్టు చేసింది. స్థానిక న్యాయస్థానాలతో పాటు రాష్ట్ర హైకోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. 4 ఏళ్ల నిరవధిక న్యాయ పోరాటంతో ఆయన బెయిల్ సాధించడం విశేషం. నొబొదిగొంతొ క్యాపిటల్ సర్వీసు చిట్‌ఫండ్ సంస్థతో లింకులు ఉన్నాయనే ఆరోపణతో ఆయనను సీబీఐ వర్గాలు అరెస్టు చేశాయి. 2011వ సంవత్సరం నుంచి 2013 మధ్య అమాయక ప్రజల నుంచి ఆయన రూ.15 కోట్లు పోగు చేసినట్లు ఆరోపణ. మయూర్భంజ్ జిల్లాలో 2014 జూలైలో ఆయన ఇంటిపై సీబీఐ దర్యాప్తు బృందం దాడి చేసింది. ఈ సందర్భంగా ఆయన దగ్గర నుంచి రూ.28 లక్షల్ని సీబీఐ దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. 2014వ సంవత్సరం నవంబర్ 4వ తేదీ నుంచి ఆయన స్థానిక ఝరపడా జైలులో కారాగారవాసం చేస్తున్నారు. రామచంద్ర హంసదా ఇలా అరెస్టు కావడంతో బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నా యక్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంత వరకు బిజూ జనతా దళ్ పార్లమెంటరీ కార్యదర్శిగా ఆయన వ్యవహరించారు. -
బీజేడీకి ఎంపీ రాజీనామా
భువనేశ్వర్: ఒడిశాలోని కేంద్రపర లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేడీ సభ్యుడు వైజయంత్ పండా సోమవారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆయన బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు పెరిగాయి. ఒడిశా సీఎం, బీజేడీ అధ్యక్షుడు పట్నాయక్‌తో వైజయంత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే వైజయంత్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నవీన్‌కు పండా ఓ లేఖ రాస్తూ ‘బీజేడీ వ్యవస్థాపకుడు బిజూకు మా నాన్న సన్నిహితుడు. నాన్న అంత్యక్రియలకు పార్టీ వారెవరూ రాకుండా అడ్డుకోవడం బాధించింది. అందుకే బయటకు వెళ్తున్నా’ అని రాశారు. -
‘ఎందుకు తప్పించారో తెలియదు’
భువనేశ్వర్: బిజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి ఎందుకు తొలగించారో తనకు తెలియదని ఆ పార్టీ ఎంపీ బైజయంత్ పాండా తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్ని గౌరవిస్తానని అన్నారు. అధికార ప్రతినిధి పదవి నుంచి పాండాను శుక్రవారం ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తొలగించారు. పార్టీని ఇబ్బంది పెట్టేవిధంగా పత్రికల్లో ఆయన రాసిన వ్యాసాలు రాసినందుకు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఆయనపై చర్య తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. సీనియర్ నాయకుల్లో కొంత మంది బీజేపీ తరపున పనిచేస్తున్నారని, పార్టీని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని పాండా పేర్కొనడంతో కలకలం రేగింది. దీంతో పార్టీ పదవి నుంచి పాండాను నవీన్ పట్నాయక్ తొలగించారు. -
‘శారదా’స్కాంలో బీజేడీ ఎంపీ హన్స్దా అరెస్ట్
భువనేశ్వర్: ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్(బీజేడీ) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోట్లాది రూపాయల శారదా చిట్‌ఫండ్ స్కాంలో బీజేడీ ఎంపీ రామచంద్ర హన్స్దా, అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సుబర్న నాయక్‌తో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే హితేష్ కుమార్ బగర్తిలను మంగళవారం సీబీఐ ప్రత్యేక బృందం అరెస్ట్ చేసింది. వీరిపై మోసం, నిధుల మళ్లింపు, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలు మోపింది. ఈ ముగ్గురు ‘నాబాదీగంట క్యాపిటల్ సర్వీసెస్’ అనే పొంజి (మోసపూరిత) కంపెనీకి గతంలో డెరైక్టర్లుగా పని చేసినట్లు సీబీఐ వెల్లడించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ అధికార బీజేడీపై విమర్శలు దిగాయి. నేరస్థులను రక్షించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించాయి. అయితే, ఈ స్కాంలో తమ ప్రభుత్వానికి ప్రమేయం లేదని సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. తాజా అరెస్ట్‌ల నేపథ్యంలో ఎంపీ హన్స్దా, ఎమ్మెల్యే సుబర్ననాయక్లను బీజేడీ నుంచి సస్పెండ్ చేస్తూ నవీన్ నిర్ణయం తీసుకున్నారు.