
రామచంద్ర హంసదా
భువనేశ్వర్: అధికార పక్షం బిజూ జనతా దళ్ అభ్యర్థి, మయూర్‌భంజ్ లోక్‌సభ సిటింగ్ సభ్యుడు రామచంద్ర హంసదాకు సుప్రీంకో ర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం సుప్రీం కోర్టు నిర్వహించిన విచారణలో ఆయనకు ఈ బెయిల్ లభించింది. 4 ఏళ్లుగా ఆయన స్థానిక ఝరపడా జైలులో ఖైదీగా కొనసాగుతున్నారు. చిట్‌ఫండ్ మోసాల కేసులో సీబీఐ దర్యాప్తు బృందం ఆయనను అరెస్టు చేసింది.
స్థానిక న్యాయస్థానాలతో పాటు రాష్ట్ర హైకోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. 4 ఏళ్ల నిరవధిక న్యాయ పోరాటంతో ఆయన బెయిల్ సాధించడం విశేషం. నొబొదిగొంతొ క్యాపిటల్ సర్వీసు చిట్‌ఫండ్ సంస్థతో లింకులు ఉన్నాయనే ఆరోపణతో ఆయనను సీబీఐ వర్గాలు అరెస్టు చేశాయి. 2011వ సంవత్సరం నుంచి 2013 మధ్య అమాయక ప్రజల నుంచి ఆయన రూ.15 కోట్లు పోగు చేసినట్లు ఆరోపణ.
మయూర్‌భంజ్ జిల్లాలో 2014 జూలైలో ఆయన ఇంటిపై సీబీఐ దర్యాప్తు బృందం దాడి చేసింది. ఈ సందర్భంగా ఆయన దగ్గర నుంచి రూ.28 లక్షల్ని సీబీఐ దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. 2014వ సంవత్సరం నవంబర్ 4వ తేదీ నుంచి ఆయన స్థానిక ఝరపడా జైలులో కారాగారవాసం చేస్తున్నారు. రామచంద్ర హంసదా ఇలా అరెస్టు కావడంతో బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నా యక్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంత వరకు బిజూ జనతా దళ్ పార్లమెంటరీ కార్యదర్శిగా ఆయన వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment